టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా అనుష్క శెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన అనుష్క, తెలుగులో తన ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది.
ముఖ్యంగా అరుంధతి చిత్రంతో ఆమె క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇప్పటికీ ఆమెను స్టార్ బ్యూటీగా నిలబెట్టింది.ఇక ప్రస్తుతం ఏడాదికో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనుష్క, త్వరలోనే పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతోందట.
గతకొంత కాలంగా అనుష్క పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో ప్రభాస్‌ను ఆమె పెళ్లాడబోతుందంటూ వార్తలు వచ్చినా, వాటిని ప్రభాస్ కొట్టిపారేశాడు.
ఇప్పుడు అనుష్క పెళ్లి ఓ క్రికెట్ ఆటగాడితో జరగనుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.అనుష్క ప్రస్తుతం ఓ టీమిండియా క్రికెటర్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉందని, త్వరలో వారిద్దరు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని తెలుస్తోంది.
అయితే ఆ క్రికెటర్ ఎవరనే విషయాన్ని మాత్రం చాలా సీక్రెట్‌గా మెయింటెయిన్ చేస్తోందట అనుష్క.ఇప్పటికే 38 ఏళ్ల అనుష్క, త్వరలో పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు కూడా కోరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుందట మన స్వీటి.
మొత్తానికి అనుష్క పెళ్లి వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్ధం రిలీజ్‌కు రెడీగా ఉంది.