తెలంగాణ రాష్ట్రంలో దిశ హత్యాచారం ఘటనను మరవక ముందే ఇలాంటి అఘాయిత్యాలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.బండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఒంటరిగా జీవిస్తోంది.
అదే గ్రామానికి చెందిన రంజిత్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు.
దీంతో ఆమె ఇంటికి వచ్చిన అతడు ఆమెపై బలాత్కారం చేసి పారిపోయాడు.
తనపై అత్యాచారం జరిగిందంటూ ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.అయితే పోలీసులెవరు ఆమె గోడును పట్టించుకోలేదు.
కనీసం ఆమె ఫిర్యాదుపై కేసు కూడా నమోదు చేయలేదు.దీంతో ఆ మహిళ సీనియర్ ఎస్పీ ఎల్బీకే పాల్ ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది.
కాగా ఎస్పీ ఆదేశం మేరకు ఆ మహిళ ఫిర్యాదును స్వీకరించి అత్యాచారం జరిగినట్లు కేసు నమోదు చేశారు.
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెకు పూర్తి న్యాయం చేస్తామంటూ చెప్పుకొచ్చారు.
కానీ నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు.దీంతో బాధిత మహిళ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.
కాగా ఇటు శంషాబాద్ సమీపంలో డాక్టర్ దిశపై జరిగిన హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.