అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉన్న బెర్నీ శాండర్స్ కి రోజు రోజుకి ప్రజల మద్దతుతో పాటు వివిధ సంఘాల పార్టీల మద్దతు కూడా పెరుగుతోంది.ఇప్పటికే అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉండే పార్టీ నేతలు మద్దతు తెలుపుతున్న తరుణంలో తాజాగా న్యూయార్క్ ప్రాంత పార్టీ ప్రతినిధి అలెగ్జాన్ద్రియా కార్టేజ్ మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు బహిరంగంగానే తన మద్దతు తెలిపారు.
క్వీన్స్ బ్రిడ్జ్ పార్క్ వద్ద జరిగిన బెర్నీస్ ఇస్ బ్యాక్ అనే ర్యాలిలో పాల్గొన్న ఆమె తన పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు.
అనారోగ్యం కారణంగా తనకి బెర్నీ తో కలిసి ప్రచారంలో పాల్గొనే అవకాశం కొన్ని రోజులుగా మిస్ అయ్యాయని, ఇప్పుడు ఆరోగ్యం బాగుండటంతో పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొంటానని ఆమె హామీ ఇచ్చారు.
ఇదిలాఉంటే న్యూయార్క్ జిల్లాకి అత్యంత ముఖ్యురాలు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న కార్టేజ్ బెర్నీ కి మద్దతు ఇవడంతో అక్కడ గెలుపు సులభం అవుతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.అయితే ఆమె ఎంట్రీ తో మరింత మంది నేతలు బెర్నీ కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.