మొటిమ‌ల‌ను 2 రోజుల్లో మాయం చేసే మ్యాజిక‌ల్ జెల్ ఇదే!

చంద్రబింబంలాంటి ముఖం పై ఒక చిన్న మొటిమ వచ్చిందంటే అమ్మాయిలు ఎంతగా కలవర పడతారో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఎందుకంటే, మొటిమ‌లు అందాన్ని దెబ్బ తీస్తాయి.

 This Is The Magical Gel That Will Get Rid Of Acne In Two Days, Magical Gel, Acne-TeluguStop.com

అందుకే మొటిమల‌ను పోగొట్టుకోవ‌డం కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు.ఏవేవో ఫేస్ ప్యాక్స్‌, మాస్క్స్‌ వేసుకుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలీక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు.

అయితే మొటిమలతో వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జెల్ ను గ‌నుక‌ వాడితే కేవలం రెండు రోజుల్లోనే మొటిమలను తరిమికొట్టొచ్చు.మరి ఇంతకీ మ్యాజికల్ జెల్ ను ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా ఉప‌యోగించాలి.? వంటి విష‌యాల‌ను ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే అందులో ఐదు నుంచి ఎనిమిది చుక్క‌లు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మొటిమల‌ను నివారించే మ్యాజిక‌ల్ జెల్‌ సిద్ధం అయినట్టే.

Telugu Acne, Tips, Homemade Gel, Latest, Magical Gel, Skin Care, Skin Care Tips-

ఈ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే వారం నుంచి ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ఈ జెల్‌ను రోజుకు రెండు సార్లు మొటిమ‌లు ఉన్న చోటే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంత‌రం గోరువెచ్చని నీటితో శుభ్రంగా ఫేస్‌ను క్లీన్‌ చేసుకోవాలి.

ఈ విధంగా త‌యారు చేసుకున్న జెల్‌ను వాడితే రెండు రోజుల్లోనే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయం అవుతాయి.అదే స‌మ‌యంలో చ‌ర్మంపై ఏమైనా ముడ‌త‌లు ఉంటే క్రమంగా దూరం అవుతాయి.

ముఖ చ‌ర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా త‌యార‌వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube