1.ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక ప్లేయర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు.ఐపీఎల్ టోర్నీ కి తాను రిటైర్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
2.మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పై ఎస్సీ ఎస్టీ కేసు
మాజీమంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది.ఓ ప్రభుత్వ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
3.ఖమ్మంలో బిసి స్టడీ సర్కిల్ ప్రారంభం
ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ సెంటర్ ను మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
4.నేడు సాగర్ లో కేటీఆర్ పర్యటన
తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.
5.అమిత్ షా కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడ లో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు.ఇందులో అనేక ప్రశ్నలను రేవంత్ రెడ్డి వేస్తూ సమాధానం చెప్పాలని లేఖ లో డిమాండ్ చేశారు.
6.తెలంగాణలో ధాన్యం సేకరణ పై కేంద్రం కీలక నిర్ణయం
తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల పోర్టిఫైడ్ పారా బాయిల్డ్ సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.
7.యాదాద్రి జిల్లాలో మధ్య రాతియుగం చిత్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం యావపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మధ్య రాతియుగం నాటి చిత్రాలు బయటపడ్డాయి.
8.రాజధాని గ్రామంలో అభివృద్ధి ఆగిపోయింది : జీవీ ఎల్
ఏపీ రాజధాని గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
9.వైసీపీ మేనిఫెస్టో లోని హామీలను విస్మరించింది
వైసిపి మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు.
10.పెంచలకోన బ్రహ్మోత్సవాలు
నెల్లూరు జిల్లాలోని రావూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
11.జనసేన ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు వంతెన వద్ద జనసేన ఆందోళనకు దిగింది.శిథిలావస్థకు చేరిన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో జనసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
12.విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తం
విజయవాడ నగరంలో విద్యార్థి సంఘాలు భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
13.నాదెండ్ల మనోహర్ విమర్శలు
వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి చీత్కారాలు ఎదురవుతూ ఉండడం తో జగన్ లో ఆందోళన మొదలైంది అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
14.శ్రీరామ అలంకరణలో చిన్న వెంకన్న
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.నాల్గవరోజు శ్రీ రామ అలంకరణలో చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు.
15.ఏపీలో మూడు రాజధానులు అసాధ్యం : బీజేపీ
ఏపీలో మూడు రాజధానులు ఏర్పడడం అసాధ్యమని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
16.హైదరాబాదులో 24 గంటలు బస్సులు
హైదరాబాద్ నగరంలో ఇకపై 24 గంటలు బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.
17.గోధుమ ఎగుమతులపై కేంద్రం బ్యాన్
గోధుమలను ఇకపై విదేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్రం బ్యాన్ విధించింది.
18.ఈ రోజు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
ఈరోజు రేపు 34 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
19.కే ఏ పాల్ కామెంట్స్
హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోకసభ స్థానాలలోను తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,250 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,450
.