ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన ఇంటిలిజెన్స్ విభాగాన్ని తన స్వార్ధ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ గతకొంత కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తోంది.ఈ విషయంపై వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఏపీలో కీలక అధికారుల మార్పు విషయంపై సంచలన నిర్ణయాలు తీసుకుంది.
దాంతో టీడీపీ అధినేత దూకుడు కి కళ్ళం వేసినట్టే అంటున్నారు పరిశీలకులు.
ముందు నుంచి కూడా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
అంతేకాదు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఏపీ ఇంటిలిజెంట్ విభాగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.డేటా చౌర్యం విషయంలో కూడా ఏపీ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ క్రమంలో లో కేంద్ర ఎన్నికల సంఘం సరిగ్గా పోలింగ్ ఇంకా పదిహేను రోజులు ఉందన్న తరుణంలో సంచలన నిర్ణయం తీసుకుంది

నిన్నటికి నిన్న ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుపై బదిలీ వేటువేసిన కేంద్ర ఎన్నికల సంఘం మరో ఇద్దరు ఐపిఎస్ అధికారులు కూడా బదిలీ చేసింది.దాంతో ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి.తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం అధినేత మార్పు పెద్ద షాక్ అనే చెప్పాలి.ప్రతిపక్ష అధినేత జగన్ పై హత్యాయత్నం వైయస్ వివేకా హత్య ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పడంలో సాక్ష్యాలుగా నిలిచాయి.

వైయస్ వివేకా హత్యకేసులో లో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.ఇప్పుడు ఆయన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.ఇలా ఉంటే ఏపీ డీజీపీ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్ళిన ఆ విషయంలో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాలేదు.అయితే ఏపీలో తాజా పరిస్థితులు, నేతల పనితీరు, ప్రజాభిప్రాయం తదితర విషయాలలో ఇంటిలిజెన్స్ పై ఆధారపడే చంద్రాబు కి ఇంటిలిజెన్స్ మార్పు కి కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఇది కేవలం సాంపిల్ టచ్ మాత్రమేనని మరో రెండు రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు ఏపీలో జరగనున్నాయని అంటున్నారు పరిశీలకులు.