మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ..?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారా.? 2019 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి.ఇప్పుడు మళ్లీ పొలిటికల్ లీడర్లతో ఎందుకు టచ్‌లోకి వస్తున్నారు.?ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.నందిగామలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో లగడపాటి సమావేశం కావడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు తెరలేపింది.అంతే కాకుండా.మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెల్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

 Lagadapati Re Entry Into Politics Again , Lagadapati Re Entry , Politics , L-TeluguStop.com

2014లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రేతో హల్‌చల్‌ చేసిన ఆయన.ఆ తర్వాత పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేశారు.ఆ తర్వాత ఐదేళ్లపాటు ఎక్కడున్నారో.ఏం చేశారో కానీ.రాజకీయాలకు మాత్రం దూరమయ్యారు.మళ్లీ 2019 ఎన్నికల టైంలో సడెన్‌గా ప్రత్యక్షమైన లగడపాటి.

సర్వేల పేరుతో హల్‌చల్‌ చేశారు.ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమని.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓటమి పక్కా అని ఓ రిపోర్ట్‌ రిలీజ్‌ చేశారు.తీరా ఫలితాలొచ్చాక లగడపాటికి షాక్‌ తగిలింది.

ఆంధ్రా ఆక్టోపస్‌గా ముద్రపడిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ తెరపైకి వచ్చారు.ఆయన ఆదివారం ఖమ్మం పట్టణంలోని తన బంధువుల ఇంట్లో సందడి చేశారు.

అనంతరం ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.నాలుగేళ్లుగా పత్తాలేని ఆయన సడెన్‌గా వరుస కార్యక్రమాల్లో పాల్గొనడంతో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ కాబోతున్నారన్న ప్రచారం జరిగింది.

ఇదే విషయాన్ని విలేకరులు ఆయన్ని అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Khammam, Lagadapati, Mlavasantha-Political

తానిప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పిన రాజగోపాల్… ఇప్పట్లో ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.ఖమ్మానికి ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం వచ్చాను తప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.రాజకీయాల గురించి తననేమీ అడగొద్దని సూచించారు.

అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత రాజకీయం మొత్తం కమ్మ సామాజిక చుట్టూ తిరుగుతున్న వేళ లగడపాటి రాజగోపాల్ అక్కడికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.ఆయన మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం ఊపందుకోవడంతో ప్రస్తుతం తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేయడం విశేషం.

ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమైనందున ఇకపై సర్వేలు చేయబోనని అప్పట్లో లగడపాటి రాజగోపాల్ ప్రకించారు.2009 ఏపీ అసెంబ్లీ ఫలితాలకు ఒక్క రోజు ముందుగా టీడీపీకి 100 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని, వైసీపీ కేవలం 70 స్థానాలకే పరిమితం కానుందని సర్వే ఫలితాలను విడుదల చేశారు.2008 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజా కూటమి అధికారం చేపట్టబోతోందని ప్రకటించారు.లగడపాటి సర్వే ఫలితాలకు భిన్నంగా తెలంగాణలో టీఆర్ఎస్ 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.

దీంతో ఇక భవిష్యత్తులో ఎన్నికల సర్వేలు నిర్వహించబోనని లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.

Telugu Khammam, Lagadapati, Mlavasantha-Political

2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్‌ మెజారిటీ సాధించినా.రాష్ట్రానికి గుండెకాయ లాంటి విజయవాడలో మాత్రం ఎంపీ సీటు కోల్పోయింది.అక్కడ టీడీపీ అభ్యర్థి కేశినేని విజయం సాధించారు.

వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ.ఓటమి తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బెజవాడ పార్లమెంట్‌ స్థానాన్ని కచ్చితంగా గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ హైకమాండ్‌.ఇప్పుడా స్థానం నుంచి లగడపాటి రాజగోపాల్‌ పోటీ చేయబోతున్నారా? అందుకే వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ను కలిసి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube