పీకే నిర్ణయంతో మళ్లీ స్పీడ్ పెంచిన టీ కాంగ్రెస్..

కాంగ్రెస్ లో అయోమయానికి తెర పడింది.టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేటతెల్లమైంది.

 Telengana Congress Speeds Up Again With Pk Decision Telengana Congress ,pras-TeluguStop.com

దీంతో నిన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేతలు మళ్లీ స్వరం పెంచారు.పీకే టీఆర్ఎస్‌తోనే ఉంటాడని టీఆర్‌ఎస్ వర్గాలు ధీమాను వ్యక్తం చేస్తుంటే.

కాంగ్రెస్ మాత్రం ఎదురుదాడి మొదలుపెట్టింది.కాంగ్రెస్‌తో ఉంటానని చెప్పిన ప్రశాంత్ కిషోర్.

ప్రగతిభవన్‌కు వెళ్లిన తర్వాతే మారిపోయాడంటూ సెటైర్లు వేస్తున్నారు.ఈ పరిణామాలు ఎలా ఉన్నా.

రాష్ట్రంలో పరిణామాలు మాత్రం రసవత్తరంగా మారుతున్నాయి.వ్యూహకర్తల మధ్య యుద్ధం మొదలైనట్లుగా భావిస్తున్నారు.

సొంత వ్యూహాలతోనే టీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్ ఈసారి పీకే సాయం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు.పీకే ఉంటే సగం గెలిచినట్టేనని టీఆర్‌ఎస్ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి.

ఇలాంటి వ్యూహకర్తల అంశాల్లో ఏనాడు మాట్లాడని మంత్రి కేటీఆర్ కూడా ఐప్యాక్‌తో ఒప్పందం చేసుకున్నామంటూ ప్రకటించుకున్నారు.దీంతో రాష్ట్రంలో వ్యూహకర్తల యుగం మొదలైందని రాజకీయవర్గాలు భావించాయి.

ముందుగా టీఆర్‌ఎస్‌తో పీకే ఒప్పందం చేసుకున్నాడని వచ్చిన ప్రచారంపై కేసీఆర్ కూడా స్పందించారు.పీకే వ్యూహకర్తగా వ్యవహరిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తాడని చెప్పుకొచ్చారు.

కానీ, అదే సమయంలో పీకే అనూహ్యంగా సోనియా శిబిరంలో చేరారు.

దీంతో పీకే అంశం వారం రోజులు చర్చగా మారింది.ఢిల్లీలో కాంగ్రెస్‌కు నివేదిక ఇచ్చి, తాను కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమే అనే సంకేతాలిచ్చిన అనంతరం హైదరాబాద్‌లో తేలారు.

ప్రగతిభవన్ వేదికగా మకాం వేశారు.కొంతమంది కాంగ్రెస్​నేతలతోనూ సమావేశమయ్యాడనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో రెండు పార్టీలు సెల్ఫ్ గోల్‌లో పడినట్లుగా మారింది.ఎందుకంటే ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉప్పు.

నిప్పుగా వ్యవహరిస్తున్నాయి.కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

అటు కాంగ్రెస్ తమకు ప్రధాన ప్రత్యర్థి అన్నట్లుగా టీఆర్ఎస్ భావించినా.దీన్ని ఎక్కడా బయటకు చెప్పకుండా హస్తం నేతలకు వల వేసింది.

కానీ, ప్రశాంత్ కిషోర్ వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అంచనా వేశారు.అటు బీజేపీ కూడా విమర్శలకు పదును పెట్టింది.

ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం లేదని స్పష్టత వచ్చింది.అటు కాంగ్రెస్, ఇటు పీకే కూడా దీనిపై ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Telugu Rahul Ghandhi, Revanth Reddy, Trs, Ts Poltics-Political

వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలో వ్యూహకర్తలు మకాం వేశారు.విపక్షాల నుంచి గట్టి పోటీ ఉన్నట్టుగా భావిస్తున్న టీఆర్ఎస్.పీకేను తెచ్చుకుంది.

ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సునీల్ కనుగోలుతో ఒప్పందం చేసుకుంది.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.

రాష్ట్ర నేతలకు సునీల్‌ను పరిచయం చేశారు.అంతకు ముందే సునీల్ రాష్ట్రంలో సర్వే చేపట్టారు.

ఆ తర్వాత ఆయన బృందం ఇక్కడే మకాం వేసింది.నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టింది.

ఇదే సమయంలో పీకే వ్యవహారం కొంత గందరగోళానికి గురి చేసింది.అయినప్పటికీ సునీల్ టీం మాత్రం సర్వే ఆపలేదు.

తాజాగా.పీకే కాంగ్రెస్‌తో ఉండరని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇద్దరు వ్యూహకర్తల మధ్య యుద్ధంగా సాగనుంది.

పీకే సారథ్యంలోని ఐప్యాక్‌లో సునీల్ గతంలో పనిచేశారు.

పీకేను విభేదించి వేరే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో వీరిద్దరి వ్యూహాలపై ఆసక్తి కొనసాగుతోంది.

ఓవైపు అధికార పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని పీకే సర్వేలోనే తేలింది.ఇదే సమయంలో ప్రజా వ్యతిరేకతను అందుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుందని, వర్గపోరుతో సతమతమవుందని, అంతా కలిస్తేనే అధికార పార్టీని ఎదుర్కోవచ్చని సునీల్.

ఏఐసీసీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు కాంగ్రెస్ నేతల్లో అనిశ్చితి నెలకొంది.

ఢిల్లీలో కాంగ్రెస్, హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌తో పీకే చర్చలు జరుపుతున్న నేపథ్యంలో హస్తం నేతలు ఏం మాట్లాడాడో తెలియక సైలెంట్​ అయ్యారు.కానీ, ఇప్పుడు పొత్త ఉండదని స్పష్టమైంది.

ఈ నేపథ్యంలో వచ్చేనెల 6న రాష్ట్రానికి రానున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి అస్త్రాలు సిద్ధమవుతున్నాయి.

ప్రధానంగా టీఆర్ఎస్ వైఫల్యాలను టార్గెట్​ చేస్తూ రాహుల్ ప్రసంగం ఉండనుందని కాంగ్రెస్​ శ్రేణులు చెప్తున్నారు.

నిరుద్యోగులు, యువత, రైతులు, వ్యవసాయ కార్మికుల మద్దతు కూడబెట్టి రాహుల్ సభతో టీఆర్ఎస్‌పై సమరశంఖం పూరిస్తారని హస్తం నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.వారం రోజుల ఆయోమయ గ్యాప్ తర్వాత కాంగ్రెస్ నేతలు మళ్లీ స్పీడ్ పెంచారు.

నిన్నటి దాకా అంటీముట్టనట్టుగా మాట్లాడిన నేతలు ఒక్కసారిగా విమర్శలు పెంచుతున్నారు.ముందస్తు సంకేతాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదంటూ ఈ రెండు టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదంటూ ఈ రెండు రోజుల వ్యవధిలో ప్రకటించారు.ఇప్పుడు అధికార పార్టీపై ఆరోపణలకు పదును పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube