కేజీ చేపలు 100 నుండి 200 వరకు ఉంటుంది.మహా అయితే అయిదు వందల వరకు ఉంటుంది.
అయితే జపాన్‌లో ఒక చేప ఏకంగా 22 కోట్ల ధర పలికింది.ఆ చేప 278 కేజీల బరువు ఉంది.
అంత బరువు ఉన్నా కూడా మరీ అంత రేటు పలకండం రికార్డుగా చెబుతున్నారు.టోక్యోలోని ఒక రెస్టారెంట్ అధినేత ఈ అత్యధిక బరువైన చేపను అత్యంత ఖరీదు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.
ఈ చేపను కొనుగోలు చేసినందుకు ఆయన పేరు మారుమ్రోగిపోతుంది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపను తాను కొనుగోలు చేసినందుకు గర్వంగా ఉందని సదరు రెస్టారెంట్ ఓనర్ అంటున్నాడు.
బ్లూఫిన్ జాతికి చెందిన చేపకు జపాన్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.అత్యంత ఖరీదైన చేపలుగా బ్లూఫిన్ చేపలకు పేరు ఉంది.ధనవంతులు మాత్రమే ఆ చేపను తింటూ ఉంటారు.బ్లూఫిన్ చేపలు చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి.దానికి తోడు రుచి మరియు పోషకాలు మరియు ఔషదగుణాలు ఆ చేపలో ఎక్కువ.అందుకే అప్పుడప్పుడు దొరికిన ఆ బ్లూఫిన్ చేపలకు జాలర్లు ఇలా వేలం వేస్తూ ఉంటారు.
వేలంలో చేపలను అత్యధిక ధరకు కొనుగోలు చేస్తారు.గతంలో లక్షల్లోనే అమ్ముడు పోయిన బ్లూఫిన్ ఈసారి మాత్రం ఏకంగా 22 కోట్లకు అమ్ముడు పోయింది.
ఈసారి బరువు ఎక్కువ ఉండటంతో పాటు పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఇంత రేటు పలికినట్లుగా చెబుతున్నారు.
వేలం ప్రారంభంలో నాలుగు నుండి అయిదు కోట్ల వరకు ఈ చేప అమ్ముడు పోతుందని అంతా భావించారట.కాని చాలా కాలం తర్వాత దొరికిన చేప అవ్వడంతో పాటు, ఎంతో మంది ఈ చేప కోసం ఎదురు చూస్తున్న కారణంగా 22 కోట్ల వరకు వేలంలో రేటు పెరిగింది.ఈ చేపను అత్యధిక రేటుకు దక్కించుకున్న ఆయన అంతకు మించి డబ్బు వచ్చేలా దాన్ని పీసులను అత్యధిక ధరకు అమ్ముతానంటున్నాడు.అయితే ఆ రేటును మాత్రం ఇంకా నిర్ణయించలేదు.25 నుండి 50 వేల వరకు రిటైల్ గా అతడు అమ్మే అవకాశం ఉందంటున్నారు.25 కోట్లకు ఆయన వచ్చేలా మార్కెటింగ్ చేస్తాడని జపనీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మొత్తానికి 22 కోట్ల ఆ చేప ప్రపంచంలోనే అరుదైన చేపగా నిలిచింది.