సెలబ్రెటీలు లేదా నలుగురిలో పేరు ఉన్న వారు ఏం మాట్లాడినా కూడా చాలా మంది ఆ మాటను వింటారు, స్పందిస్తారు అనే విషయాన్ని గుర్తించాలి.సెలబ్రెటీ అన్నప్పుడు మాటలో, చేతలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఒక్క మాట అన్నా కూడా దాన్ని వెనక్కు తీసుకోవడం కష్టం అవుతుంది.ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా పరిధి చాలా పెరగడం వల్ల ఏ చిన్న మాట అన్నా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆ విషయంను మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మర్చి పోయిందేమో అనిపిస్తుంది.
నిన్న నరేంద్ర మోడీ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ జాతిపిత నరేంద్ర మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యలు చేసింది.ఆమె అవగాహణ రాహిత్యంతో చేసిందో లేక భారత్కు మోడీని మరో జాతిపితగా ఆమె స్వయంగా మార్చిందో తెలియదు కాని ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.జాతిపిత ఎవరు అనే విషయం తెలియకుండానే మీరు ఎలా ఒక సభలో మాట్లాడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.