నిస్తేజంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మారటానికి అనేక రకాలైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటాం.అయినా కొంత వరకే ప్రయోజనం ఉంటుంది.
అది కూడా తాత్కాలికమే.అంతేకాక ఈ కాస్మొటిక్స్ అన్ని చర్మ తత్వాలకు సరి పడవు.
అలాంటప్పుడు మనం రోజు ఉపయోగించే కూరగాయలతో పేస్ పాక్స్ వేసుకుంటే అద్భుతాన్ని చూస్తారు.వీటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
బంగాళాదుంపబంగాళాదుంపను ఉడికించి మెత్తగా చేయాలి.
బంగాళాదుంప పేస్ట్ లో రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.
క్యారెట్రెండు స్పూన్ల క్యారెట్ పేస్ట్ లో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.
వంకాయవంకాయను పేస్ట్ గా చేసుకొని దానిలో తాజా అలోవెరా జెల్ ని కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.
బీట్ రూట్రెండు స్పూన్ల బీట్ రూట్ పేస్ట్ లో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి నిగారింపు మీ సొంతం అవుతుంది.