ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరు తెలుగు రాజకీయాల్లో తెలియని వారు ఉండరు.కాంగ్రెస్ లేడీ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరిని ఓడించిన నామా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కింగ్ అయిన తుమ్మల నాగేశ్వరరావుతోనే ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించారు.
తుమ్మల నాగేశ్వరరావు అండతో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన నామా అనతి కాలంలోనే చంద్రబాబుకు దగ్గరై అదే తుమ్మలతో తీవ్రంగా విబేధించారు.
ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన నామా ఇప్పుడు తెలంగాణ టీడీపీలోను, ఖమ్మం జిల్లాలోను ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.
ఇక తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ నామా నాగేశ్వరరావు మధ్య జరుగుతోన్న వార్‌లో చంద్రబాబు నామాకు ప్రయారిటీ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తుమ్మల టీఆర్ఎస్లోకి జంప్ చేయడం మంత్రి అవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోవడం చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడు తుమ్మల తెలంగాణ రాజకీయాల్లో ఓ కీరోల్గా మారిపోయారు.ఇక టీడీపీలో ఉన్న నామాకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని తేలిపోవడంతో ఆయన పార్టీ మార్పుపై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఆయన చంద్రబాబు గైడెన్స్‌లోనే బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారని చర్చ నడిచింది.
ఇక తాజాగా బాలయ్య నటించిన పైసా వసూల్ ఆడియో రిలీజ్ వేడుక ఖమ్మంలో జరిగింది.ఈ వేడుకలో బాలయ్య, నందమూరి అభిమానులు మంత్రి తుమ్మలతో పాటు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, నామా నాగేశ్వరరావు ఫ్లెక్సీలను కలిపి ఏర్పాటు చేశారు.
దీంతో నామా పార్టీ మార్పుపై మరోసారి వార్తలు జోరందుకున్నాయి.
ఈ ఫ్లెక్సీలు నందమూరి, టీడీపీ, టీఆర్ఎస్ అభిమానులు కామన్‌గానే ఏర్పాటు చేసినా ఆయన పార్టీ మార్పుపై మరోసారి ఖమ్మం జిల్లాలో ఊహాగానాలు జోరందుకున్నాయి.
అయన్ను టీఆర్ఎస్లోకి వెళ్లి తుమ్మలతో రాజీపడి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా ? లేదా ? ఆయనకు గతంలో కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తారా ? అన్నది మాత్రం క్లారిటీ రావడం లేదు.ఏదేమైనా వచ్చే ఎన్నికలకు ముందుగానే నామా పార్టీ మారడం అయితే ఖాయమన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది.
ఓవరాల్‌గా మూడు పార్టీల మధ్య నామా పేరు నలుగుతోంది.