ఎక్కడైనా పార్టీ అధ్యక్షుడి మాట ఎమ్మెల్యేలు వినాలి.ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఛాన్స్ అప్పట్లో జస్ట్ మిస్ చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే తన జీవిత ఆశయంగా పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తున్నాడు.
టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ దెబ్బకి మనోడి మైండ్ పోతున్నట్టు ఉంది పరిస్థితి.ఒక్కొక్క ఎమ్మెల్యే వైకాపా కి దూరంగా వెళుతూ ఉంటే బిక్కు బిక్కు మంటూ వారిని కాపాడుకునే ప్రయత్నం లో ఉన్నాడు జగన్.
అడిగిన పదవిని కట్టబెడితే కానీ ఎమ్మెల్యే గా ఉండను అని ఒక ఎమ్మెల్యే జగన్ ని బ్లాక్ మెయిల్ చేసి మరీ లబ్ది పొందాలి అని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలోకి ఫిరాయిస్తారనే పుకార్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి.
ఆ వ్యవహారం అనుకున్నంత వేగంగా జరగలేదు.అయితే అనూహ్యంగా ప్రతిపక్షం తరఫున పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న భూమా నాగిరెడ్డి పార్టీ మారిపోయారు.
దీంతో కేబినెట్ హోదా తో పాటూ విపరీతమైన అధికారాలు ఉండే పీఏసీ ఛైర్మన్ పదవి ఖాళీ అయింది.దీన్ని అవకాశంగా భావించిన గొట్టిపాటి రవికుమార్ జగన్‌తో ఇప్పుడు బేరం పెడుతున్నారట.
పీఏసి చైర్మన్ పదవి తనకి కావాలి అని లేదంటే పార్టీ మారి తీరతా అంటున్నాడు ఈయన.