ఈ నెలలో విశాఖ పర్యటనలో చాలా గందరగోళం ఏర్పడింది.పర్యటనలో ఎలా కొనసాగుతుంది, ఎవరెవరు హాజరవుతారు అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.
ముఖ్యంగా ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ పాల్గోననున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ ఏడాది జులై 4న ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో జరిగిన సభకు జనసేన అధినేత, బీజేపీ మిత్రపక్షం పవన్ కల్యాణ్ రాలేకపోయారు. భీమవరం సమావేశానికి పవన్‌కు ఆహ్వానం అందలేదని జననేతలు చెప్పగా, కొన్ని కారణాల వల్ల ఆ సభ నుంచి తప్పుకున్నట్లు పవన్ స్వయంగా ప్రకటించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మాజీ మంత్రి, పవన్ కళ్యాణ్ సోదరడు కె.చిరంజీవిని ఆహ్వానించింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత నవంబర్ 11న ప్రధాని విశాఖపట్నం వస్తున్నారు . పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమం కావడంతో ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంపిక చేసిన కొంతమంది నాయకులకు మాత్రమే ఆహ్వనం పలకనుంది. బహిరంగ సభలో ప్రధానమంత్రితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో వేదికపై ఉండే అవకాశం ఉంది.

ప్రధాని అనుమతిస్తే, ఈ సమావేశానికి కేంద్ర మంత్రుల హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమావేశం అధికారంగా కొనసాగుతుండంతో పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రధానిని కలిసే అవకాశం లేకుండా పోయింది.అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కాకుండా టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నందున బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ కల్యాణ్‌ను పట్టించుకోనట్లు అర్థమవుతోంది.కావున ప్రధాని పర్యటనలో పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా కనిపించకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పవన్ కళ్యాణ్ వేదికపైకి రావడం వల్ల ముఖ్యమంత్రికి జగన్‌కు ఇబ్బందికరంగా ఉద్దేశంతోనే అధికార పార్టీ ఇలా చేస్తుందని జనసేన అంటుంది.