అధికారం లో ఉన్న ఏ రాజకీయ నేత అయినా తమ రాష్ట్ర పని తీరు పెంచుకోవడం కోసం చేసిన మంచిని చెప్పుకోవడమో,ఉన్న దానిని ఎక్కువ చేసి చెప్పడమో సాధారణమైన విషయమే…అయితే మన గొప్పతనాన్ని చెప్పడానికి పక్క వారిని తక్కువ చేసి చూపినప్పుడే అవి వివాదాస్పదమవుతాయి … తెలంగాణ రాక ముందు వరకు ఆంధ్ర ప్రాంతంపై ఎడాపెడా నోరు పారేసుకున్న తెలంగాణ ప్రాంత నాయకులు , తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత సంయమనం పాటించారని చెప్పవచ్చు.ఇది తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్ల కోసం అని వాదన లేకపోలేదు.
ఏది ఏమైనా తెలుగు ప్రజల మధ్యన విభేదాలు లేకుండా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.
కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది అనవసరమైన విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు…తెలంగాణ రాష్టం లో వరిసాగు మంచిగా జరుగుతుంది అని చెప్పడానికి ఆంధ్రరాష్ట్రాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ గా అక్కడి రాజకీయ నాయకులు అందరూ చెప్తూ ఉంటారని అయితే అక్కడ ఈ సీజన్ లో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేసారని అదే తెలంగాణ లో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని పేర్కొన్నారు….
ఇక్కడ వరిసాగు పెరగడం తో పక్క రాష్ట్రాల నుండి కూడా వ్యవసాయ కూలీలు వస్తున్నారని చెప్పారు….సిద్దిపేట్ జిల్లా జగదేవపూర్ లో జరిగిన సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమం లో పాల్గొని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు….ఒక పక్క BRS పార్టీ దేశమంతా విస్తరించేలా ఆ పార్టీ పెద్దలు ప్రణాళికలు రచిస్తుంటే మరో పక్క ఇదేసమయం లో తెలంగాణ రాజకీయాలలో ఎలా ఉన్నా పక్క రాష్ట్రాల జోలికి ఎప్పుడూ పోనీ హరీష్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం గా మారింది.
దీనిపై ఆంధ్ర ప్రాంత నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి
.