భారత దేశం లో దశాబ్దాల నుంచీ జూదం చట్ట విరుద్ధం.క్లబ్బుల్లో పేకాట, మరెక్కడైనా బెట్టింగ్ లూ పోలీసులు అనుమతించరు.
కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.ఆన్లైన్ లో బెట్టింగ్ లకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేయడం చట్ట విరుద్ధం అని చెప్పగల చట్టాలు లేకపోవడమే దానికి ప్రధాన కారణం.ఇప్పుడు ఆన్ లైన్ బెట్టింగ్ అనేది బహిరంగంగా సాగిపోతోంది.
ఇలాంటి బెట్టింగ్ లలో ఐపీఎల్ బెట్టింగ్ లే టాప్ పొజిషన్ లో ఉన్నాయి.ఐపేఎల్ మ్యాచ్ ల సమయంలో భారీగా బెట్టింగ్ లు జరుగుతూ ఉంటాయి.
ఇండియా బెట్ డాట్ కాం నుంచి అనేక వెబ్సైటు లు ఈ విధంగా తమ కార్యకలాపాలని సాగిస్తూ ఉంటారు.ఇంటర్నేషనల్ బూకీ లతో కనక్ట్ అయ్యి మరీ ఈ వ్యవహారం నడిపిస్తూ ఉంటారు.
వెబ్ సైట్లలో తొలుత రిజిస్ర్టేషన్ చేసుకోవాలి… అనంతరం అందులో ఐపీఎల్ సెక్షన్ కు వెళ్తే అక్కడ మొత్తం మ్యాచ్ ల వివరాలన్నీ ఉంటాయి.అందులో అప్పటికి జరుగుతున్న ఏ ఆటపై పందెం కాయాలన్నది నిర్ణయించుకోవాలి.
కేవలం మ్యాచ్ ఫలితంపైనే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారన్న చోట మొదలుపెట్టి బాల్ టు బాల్ పందేలు నడుస్తుంటాయి.ఆ బంతికి వికెట్ పడుతుందా… ఎన్ని రన్స్ తీస్తారు… డాట్ బాలా? రన్నవుట్ అవుతారా.? వంటి అన్ని ఆప్షన్లపై బెట్టింగులు నడుస్తుంటాయి.







