వరల్డ్ తమిళ్ ఫెడరేషన్ అధ్యక్షుడు పళ నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ పై అబద్ధపు వార్తలు ప్రచారం చేశారని తెలిపారు.
ప్రభాకరన్ బతికే ఉన్నారని నెడుమారన్ వెల్లడించారు.ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారన్నారు.
కానీ ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు చెప్పకూడదని వ్యాఖ్యనించారు.తమిళ జాతి స్వేచ్ఛ కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులంతా ప్రభాకరన్ కు మద్ధతుగా నిలవాలని నెడుమారన్ కోరారు.
.