పిట్ట కొంచెం.కూత గణం.
ఇలాంటి సామెత మనం నిజజీవితంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.కొంతమంది మనుషులు చూడటానికి కొద్దిగా ఉన్న వారు చేసే పనులు మాత్రం చాలా ఘనంగా ఉంటాయి.
అలాంటి పరిస్థితులలో ఈ సామెతను ఎక్కువగా వాడుతూ ఉంటాం.అచ్చం అలాగే కేవలం చేతి వేలికి ఉన్న గోరంత ఉన్న చేప చేసే పనికి నిజంగా మనం ఆశ్చర్య పోవాల్సిందే.
మామూలుగా కొన్ని చేపలు శబ్దాలు( Fish Sounds ) చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా.?! నిజానికి లేదని చెబుతారు చాలామంది.కానీ కొన్ని రకాల చేపలు మాత్రం అనేక రకాల శబ్దాలను చేస్తూ నీటిలో ఉంటాయి.ఇక అసలు విషయంలోకి వెళితే.
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/World-Smallest-Fish-found-to-make-sounds-that-exceed-140-decibels.jpg)
ప్రపంచంలోనే పరిమాణంలో అత్యంత చిన్న చేప అయిన డానియోనెల్ల సెరెబ్రం( Danionella Cerebrum ) అనే చేప కేవలం మనిషి గోరు పరిమాణం మాత్రమే ఉంటుంది.అంటే కేవలం ఈ చేప 10- 12 మిల్లీమీటర్ల మధ్యలో మాత్రమే ఉంటుంది.అయితే ఈ చేప పరిమాణంలో అంతచిన్నగా ఉన్న కానీ.అది విడుదల చేసే శబ్దాలు మాత్రం భయంకరంగా ఉంటాయి.ఒకసారి మనిషి చెవులకు కూడా హాని కలిగించేలా ఆ చేప కూతలు ఉంటాయి.ఈ చేపలు ఏకంగా 140 డెసిబుల్స్ ( 140 Decibels )పైగా శబ్దాలు చేయగలవని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఈ శబ్దం దాదాపు ఓ భారీ విమానం టేకాఫ్ సమయంలో 100 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎంత శబ్దం వినపడుతుందో అంత శబ్దానికి సమానంగా ఉంటుంది.
![-Latest News - Telugu -Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/World-s-Smallest-Fish-danionella-cerebrum-found-to-make-sounds-that-exceed-140-decibels.jpg)
ఇకపోతే ఇంత చిన్న చేపలు ఇంత పెద్ద పరిమాణంలో ఇలా శబ్దాన్ని విడుదల చేస్తున్నాయో సైంటిస్టులకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అంత చిన్న జీవులు ఈ విధమైన శబ్దాలను విడుదల చేయడం నిజంగా అసాధారణమైన విషయమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.మామూలుగా పెద్ద పరిమాణం కల జంతువులు మాత్రమే ఎక్కువ శబ్దం సృష్టించగలరని తెలుపుతున్నారు.
ఉదాహరణకి ఏనుగు( Elephant ) తన తొండంతో దాదాపు 125 డేసిబిల్స్ వరకు శబ్దాలు చేయగలవు.కేవలం ఈ రకం చేపలు మాత్రమే కాకుండా కొన్ని రకాల చేపలు కూడా వీటి కంటే కాస్త తక్కువ పరిమాణంలో శబ్దాన్ని విడుదల చేస్తాయట.
అయితే ఈ శబ్దాన్ని విడుదల చేయడానికి గల కారణం ఆ చేపలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి ఉపయోగిస్తాయట.