మూగ జీవుల పట్ల చాలామంది దయ తలచి ఆహారం అందిస్తుంటారు.వాటికి ప్రతిఫలంగా ఆ జీవులు తమ రుణం కూడా తీర్చుకుంటాయి.
కుక్కలు నిత్యం ఇంటిని కాపాడుతూ తమ వంతుగా సహాయం చేస్తాయి.పిల్లులు కూడా యజమానుల కోసం ఏదో ఒక పని చేసి పెడతాయి.
పశువులు తమ జీవితాంతం పాలు ఇస్తూ, చాకిరీ చేస్తూ మనుషులు పెట్టిన కాస్త గడ్డికి కృతజ్ఞతలు తెలుపుతాయి.అయితే ఈ జంతువులే కాదు చిన్నపాటి ఉడుతలు( Squirrel ) కూడా కృతజ్ఞత భావంతో తమకు ఆహారం అందించి యజమానులకు మంచి చేస్తాయి.
తాజాగా ఒక వీడియో అదే విషయాన్ని నిరూపిస్తోంది.
ఊహించని మార్గాల్లో దయ ఎలా తిరిగి వస్తుంది అనేదానికి హార్ట్ టచింగ్ ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, ఒక మహిళ( Woman ) ఉడుతకు రోజూ క్రమం తప్పకుండా ఫుడ్( Food ) అందజేస్తోంది.అయితే తనకి ఫుడ్ పెడుతున్న మహిళకు ఏదో ఒకటి చేయాలని ఉడుత భావించింది.
అందుకే అది ఆమె తలుపు దగ్గర గోడపై ఒక పెద్ద కుకీ( Cookie ) పెట్టి వెళ్లిపోయింది.సీసీటీవీ ఫుటేజీని చూసే వరకు దాన్ని ఎవరు అక్కడ వదిలేశారన్నది ఆమె తెలుసుకోలేక అయోమయంలో పడింది.
సీసీటీవీ ఫుటేజీలో ఉడుత తన నోటిలో కుకీ పట్టుకుని మెట్లు, రెయిలింగ్ పైకి ఎక్కి, గోడపై మెల్లగా ఉంచినట్లు అనిపించింది.తర్వాత వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లింది.ఉడుత ఆ మహిళకు ఒక కుకీ తీసుకొచ్చి ఆమె దాతృత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంది.ఆ విషయం తెలుసుకొని సదరు మహిళ చాలా ఎమోషనల్ అయ్యింది.ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియోని ఎక్స్‌లో ఫిగెన్ @TheFigen_ అనే అకౌంటు రీపోస్ట్ చేసింది.
దయ చూపిస్తే ఎలాంటి బహుమతి తిరిగి వస్తుందో చూడండి అన్నట్లు ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించింది.ఒక చిన్న అడవి జంతువు కూడా దయను మెచ్చుకోగలదని, తిరిగి దయ చూపిస్తుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తాము కూడా ఉడుతలకు ఆహారం ఇస్తామని, అవి కూడా ఇలానే తమకు బహుమతులను తెచ్చి పెడతాయని అన్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.