ప్రస్తుత కాలంలో కొందరు ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలు టిక్ టాక్ మోజులో పడి సంసార బాధ్యతలను విస్మరించడమే కాకుండా భర్త చేతిలో దారుణంగా హత్యకు గురవుతున్నారు.తాజాగా ఓ మహిళ టిక్ టాక్ వీడియోల మోజులో పడి కుటుంబాన్ని నెగ్లెట్ చేయడంతో తట్టుకోలేక పోయినటువంటి భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కడోలోరు జిల్లాలో కొమురవెల్ అనే వ్యక్తి రాజేశ్వరి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే మొదట్లో వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
దీంతో వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే గతకొద్దికాలంగా స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నట్టు వంటి రాజేశ్వరి అందులో టిక్ టాక్ అప్లికేషన్ ని ఉపయోగిస్తోంది.
ఇందులో భాగంగా తాను కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది.అయితే ఈ విషయాలు తన భర్త కొమరవెల్ కి అస్సలు నచ్చేది కాదు.
దీంతో కుటుంబ బాధ్యతలను చక్కదిద్దాలని ఎంత చెప్పినప్పటికీ రాజేశ్వరి వినేది కాదు.ఈ విషయమై తరచూ గొడవలు పడేవారు.
![Telugu Tamil Nadu, Tamil Nadulocal-Telugu Crime News(క్రైమ్ వా Telugu Tamil Nadu, Tamil Nadulocal-Telugu Crime News(క్రైమ్ వా](https://telugustop.com/wp-content/uploads/2020/02/husband-killed-his-wife-for-doing-tiktok-videos-in-tamil-nadu.jpg)
దీనికితోడు రాజేశ్వరికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు అమే భర్త.ఈ విషయమై తాజాగా మళ్లీ గొడవ పడ్డారు.ఈ గొడవలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఇనుప చువ్వతో గట్టిగా రాజేశ్వరి తలపై మోదాడు.తలపై బలమైన గాయం తగలడంతో రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది.
దీంతో భయపడినటువంటి కొమరవెల్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇది గమనించిన టువంటి స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి స్థానికులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.అయితే విచారణలో భాగంగా పరారీలో ఉన్నటువంటి రాజేశ్వరి భర్త కొమరవెల్ ని పట్టుకొని తమదైన శైలిలో విచారించగా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు.