స్టార్ హీరోయిన్ జెనిలియా ( Jenelia ) ఒకప్పుడు స్టార్ నటిగా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది.ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా హిట్ అవ్వడంతో జెనీలియా కి మంచి అవకాశాలు వచ్చాయి.అలా ఈమె టాలీవుడ్ లో రెడీ ,శశిరేఖ పరిణయం, బొమ్మరిల్లు, నా అల్లుడు,హ్యాపీ( Happy ), ఆరెంజ్, సై, ఢీ,సాంబ వంటి సినిమాల్లో నటించింది.
ఇక జెనీలియా ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం బొమ్మరిల్లు సినిమా అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాలోని హాసిని పాత్రకి జెనీలియాకి మంచి గుర్తింపు లభించింది.

చలాకి టింగరితనం అన్ని కలగలిపిన పాత్రలో జెనీలియా చాలా బాగా సెట్ అయింది.ఈ సినిమాతో జెనీలియా రేంజ్ పెరిగిపోయింది అని చెప్పుకోవచ్చు.ఇదంతా పక్కన పెడితే బొమ్మరిల్లు సినిమా ద్వారా బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar ) గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఈ సినిమా షూటింగ్ సమయంలో జెనీలియాని అర్ధరాత్రి ఆ పని చేయాలి అని టార్చర్ చేశారట.ఇక అర్ధరాత్రి రోడ్డు మీద ఆ పని అంటే జెనీలియా చాలా అసహనంగా ఫీల్ అయిందట.
ఇక అర్ధరాత్రి నడిరోడ్డుపై అలాంటి పనులు అంటే మీరు చెడుగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.ఎందుకంటే బొమ్మరిల్లు ( Bommarillu ) సినిమాలో అర్ధరాత్రి పూట జెనీలియా ఐస్ క్రీమ్ తినే ఒక సన్నివేశం ఉంటుంది.
అయితే ఈ సన్నివేశం కోసం నైట్ టైం లో డైరెక్టర్ జెనిలియా కు ఫోన్ చేసి ఇప్పుడు ఒక షూట్ తీద్దాం అని రమ్మన్నారట.ఇక ఈ రాత్రి సమయంలో ఏంటి అని చెప్పగా నైట్ టైం లో అయితేనే ఈ సన్నివేశం బాగుంటుంది.
సినిమాకి ఇది కూడా ఒక మంచి ప్లస్ అని షూటింగ్ సెట్ కి పిలిచి ఐస్ క్రీమ్ తినిపించారట.

క ఐస్ క్రీమ్ తినే సన్నివేశం బాగా రాకపోవడంతో నాలుగైదు సార్లు టేకులు తీసుకొని మరీ చేయించారట.ఎందుకంటే ఆ సన్నివేశంలో నటించేటప్పుడు జెనీలియా ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వలేదట.అందుకే నాలుగైదు సార్లు టేక్స్ తీసుకున్నారట.
కానీ లేట్ నైట్ లో ఆ చలిలో ఐస్ ఐస్ క్రీమ్ తినలేక కాస్త ఇబ్బందిగా అనిపించిందట.ఒక రెండు మూడు టేక్స్ తీసుకున్నాక నాకు సినిమా వద్దు షూటింగ్ వద్దు అని జెనీలియా వెళ్ళిపోబోయిందట.
కానీ సినిమా యూనిట్ మొత్తం బ్రతిమిలాడేసరికి ఎలాగొలా సినిమా షూటింగ్ పూర్తి చేసిందట.