విశ్వ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 గా ఉండబోతుంది వీరే !

బిగ్‌బాస్ సీజన్-5 కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది.ఈ గేమ్ షోకు TRP రేటింగ్స్ కూడా బాగానే వస్తున్నాయి.

 Who Is The Final 5 After Vishwa Elimination In Bigg Boss Telugu Season 5 Details-TeluguStop.com

బిగ్‌బాస్ ప్రొగ్రామ్ కాన్సెప్ట్ పాతదే అయినా ప్రేక్షకులు దానికి అలవాటు పడిపోయారు.ఈ సారి గేమ్‌లో పెద్దగా సెలబ్రిటీలు, తెలిసిన మొహలు కూడా లేవు.

పెద్దగా ట్విస్టులు కూడా ఏమీ లేవు.అయినా కూడా బిగ్‌బాస్ సీజన్ -5 కు ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఒక్కోసారి అర్థరాత్రి ప్రసారం అవుతున్నా కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది.ఇప్పటికే ఈ సీజన్ సగానికి పైగా పూర్తయ్యింది.

డిసెంబర్ 20 నాటికి బిగ్‌బాస్ సీజన్ పూర్తవుతుందని తెలుస్తోంది.అప్పటికే విజేత ఎవరో అందరూ ముందే గెస్ కూడా చేస్తేస్తారు.

కానీ ప్రస్తుతం అందరి ఫోకస్ టాప్ -5 లో ఎవరున్నారనేదానిపై ఉంది.తాజాగా విశ్వ కూడా హౌస్ నుంచి బయటకు రావడంతో ఈ అంచనాలు మరీ ఎక్కువ అయ్యాయి.

దీనిపై ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది.బిగ్‌బాస్‌ హౌస్‌లో అందరూ బాగానే ఆడుతున్నారు.ప్రస్తుత అంచనాల ప్రకారం ఆనీ మాస్టర్, ప్రియాంక, జశ్వంత్ మినహా రీమెనింగ్ పర్సన్స్ అంతా స్ట్రాంగ్‌గా ఉన్నారు.వచ్చే ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.

ఆ తర్వాత లిస్టులో ఏడుగురు మాత్రమే మిగులుతారు.వీరిలో టాప్ -5 ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Bigg Boss Top, Kajal, Manas, Nagarjuna, Ravi, Shanmkh, Sri Ram, Siri, Sun

ఇకపోతే సింగర్ శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ, సిరి, మానస్‌లు టాప్ -5లో ఉంటారని లీకులు వినిపిస్తున్నాయి.వీరికి రవి, కాజల్ కూడా టఫ్ ఫైట్ ఇస్తారని తెలుస్తోంది.అయితే, ఈసారి బిగ్ బాస్‌లో టాప్ -5 ఎవరన్నది ఊహకు అందని విధంగా తయారైంది.

Telugu Bigg Boss Top, Kajal, Manas, Nagarjuna, Ravi, Shanmkh, Sri Ram, Siri, Sun

మరో నాలుగు వారాలు మిగిలి ఉండగానే టాప్ ఫైవ్ ఎవరు అన్నదాని మీద జోరుగా పందాలు కూడా సాగుతున్నాయి.సామాజిక మాద్యమాల్లో కూడా పోటీదారుల అభిమానులు సైతం తెగ ఫైట్ చేసుకుంటున్నారు.టాప్ ఫైవ్‌కే ఇంత హంగామా ఉంటే మరి ఫైనల్ విజేత ఎవరనే దానిపై ఇంకెంత టెన్షన్ ఉంటుందో అని ఆడియెన్స్ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube