జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ప్రణాళికలు వ్యూహాలు ఎవరికి అంతు చిక్కడం లేదు.ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని( YCP ) గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్ టీడీపీ మరియు బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు.అయితే ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి వెళ్తారనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
టీడీపీతో( TDP ) కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ చెబుతున్నప్పటికి మరోవైపు బీజేపీ కూడా ఎన్నికల్లో తమ ప్రయాణం జనసేనతోనే అని చెబుతోంది.
![Telugu Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Tdpjanasena-Politics Telugu Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Tdpjanasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/What-is-Janasena-Pawan-kalyan-political-strategy-detailsa.jpg)
మరి రెండు పార్టీలతో కలిసి పవన్ ఎలా ఎన్నికలకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతానికి బీజేపీ( BJP ) మాత్రం టీడీపీతో కలిసేందుకు సుముఖత చూపడంలేదు.ఈ నేపథ్యంలో పవన్ ఏదో ఒక పార్టీతో మాత్రమే దోస్తీ కొనసాగించాల్సిన పరిస్థితి.
పూర్తిగా టీడీపీతోనా లేదా బీజేపీతోనా అనేది పవన్ కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తావిస్తున్నాయి.
మరో పదేళ్ళు టీడీపీతో పొత్తులో ఉండాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో ఆంతర్యం ఏమిటనే దానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
![Telugu Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Tdpjanasena-Politics Telugu Ap, Janasena, Janasenabjp, Pawan Kalyan, Tdpjanasena-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/12/What-is-Janasena-Pawan-kalyan-political-strategy-detailsd.jpg)
ఈ ఎన్నికల్లో కూడా జనసేన( Janasena ) పూర్తిస్థాయిలో ప్రభావం చూపదని పవన్ ఫిక్స్ అయ్యారా ? అందుకే పదేళ్ళు టీడీపీతోనే అంటున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.అలా అయితే మరి బీజేపీ సంగతేంటి అనేది కూడా ఆసక్తికరమే.మొత్తానికి పవన్ తీసుకునే నిర్ణయాలు ఎవరికి అంతచిక్కడం లేదు.మరి అర్థం కానీ తన వ్యూహాలతో పవన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతారా ? లేదా అనేది చూడాలి.ఇటీవల పోటీ చేసిన తెలంగాణలో జనసేన ఘోరంగా దెబ్బతింది.దీంతో రాబోయే ఏపీ ఎన్నికల్లో( AP Elections ) జనసేన పార్టీకి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
మరి అధికారమే లక్ష్యంగా ఉన్న పవన్ కు ఆయన ప్రణాళికలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.