ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఆ రాష్ట్రాల ఫలితాలు వెలువడి పది పదిరోజులైనా ముఖ్యమంత్రుల ఎంపికలో మాత్రం జాప్యం జరుపుతూ వచ్చారు బీజేపీ పెద్దలు.
ఎట్టకేలకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇటీవల ప్రకటించారు.అయితే ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ( BJP ) అధినాయకులు ఇన్ని రోజులు జాప్యం చేయడం వెనుక భారీ వ్యూహం ఉందనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట.మరో ఐదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది కాషాయ పెద్దలు.
![Telugu Amith Shah, Madhya Pradesh, Modi, Mohan Yadav, Narendra Modi, Rajasthan-P Telugu Amith Shah, Madhya Pradesh, Modi, Mohan Yadav, Narendra Modi, Rajasthan-P](https://telugustop.com/wp-content/uploads/2023/12/amith-shah-Mohan-Yadav-Madhya-Pradesh-Narendra-Modi-politics-Bhajan-Lal-Sharma-Rajasthan.jpg)
అందులో భాగంగానే కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి గా శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని మోహన్ యాదవ్( Mohan Yadav ) కు అవకాశమిచ్చింది.అలాగే ఛత్తీస్ ఘడ్ సిఎం గా విష్ణు దేశ్ సాయి, రాజస్తాన్ సిఎంగా భజన్ లాల్ శర్మ వంటి వంటి వారిని ఎంపిక చేసింది అధిష్టానం.మద్యప్రదేశ్ లో ఈసారి బీసీలకు ప్రదాన్యం ఇచ్చేందుకే ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధం ఉన్న మోహన్ యాదవ్ ను సిఎంగా ప్రకటించింది అధిష్టానం.
ఇక గిరిజన ప్రభాల్యం ఉన్న ఛత్తీస్ ఘడ్ లో విష్ణు దేశాయ్ ని ఎంపిక చేయడంలో కూడా కుల సమీకరణాలే కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.
![Telugu Amith Shah, Madhya Pradesh, Modi, Mohan Yadav, Narendra Modi, Rajasthan-P Telugu Amith Shah, Madhya Pradesh, Modi, Mohan Yadav, Narendra Modi, Rajasthan-P](https://telugustop.com/wp-content/uploads/2023/12/Mohan-Yadav-Madhya-Pradesh-Narendra-Modi-politics-Bhajan-Lal-Sharma-Rajasthan.jpg)
ఇక రాజస్తాన్ విషయానికొస్తే బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మ( Bhajan Lal Sharma ) ను ఎంపిక చేసింది. ఇలా ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రణాళికలు చూస్తే అధిక సంఖ్యలో ఉన్న కులాలవారిని ఆకర్షించే ప్రయత్నంగానే తెలుస్తోంది.అయితే కుల సమీకరణలు చేయడం బీజేపీకి కొత్తేమీ కాదు.
ఆదివాసి వర్గానికి చెందిన వారిని ఆకర్శించేందుకు అదే వర్గానికి చెందిన మహిళా ద్రౌపది ముర్ము ను రాష్ట్రపతిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఇలా ఓవరాల్ గా దేశంలోని అన్నీ వర్గాలవారికి, కులాల వారికి దగ్గరయ్యేలా పదవులు కట్టబెడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయంపై కన్నెసింది కమలం పార్టీ.
మరి బీజేపీ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.