తెలంగాణాలోని వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు తేదీ ప్రకటించారు కాబట్టి పోరాటానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.ఇది పేరుకు ఉప ఎన్నిక అయినా పోరాటం సాధారణ ఎన్నికల స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
టీఆరెస్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేరడంతో ఉప ఎన్నిక అవసరమైంది.కెసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న మొదటి ఉప ఎన్నిక ఇది.మరో విశేషం ఏమిటంటే కెసీఆర్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో, వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో నిర్వహిస్తున్న ఉప ఎన్నిక ఇది.ఉప ఎన్నికలో గులాబీ పార్టీని ఓడగొట్టాలని ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి.ఆరు నూరైనా గెలుపు తమదేనని అదికార పార్టీ ధీమాగా ఉంది.గులాబీ ఓడిపోయినా ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేదు.కానీ కెసీఆర్ పరువు పోతుంది.గెలిస్తే ప్రజలు ఇంకా కేసీఆర్ను అభిమానిస్తున్నారని అనుకోవాలి.
ప్రస్తుతం వామ పక్షాలన్నీ కలిసి వినోద్ కుమార్ను తమ అభ్యర్థిగా నిలబెట్టాయి.మిగతా పార్టీలు నిర్ణయించలేదు.
ఎన్నికకు నెల రోజుల కంటే తక్కువ సమయమే ఉంది కాబట్టి తొందరలోనే ప్రచారం ఉధృతం అవుతుంది.ఈ ఉప ఎన్నిక ముగిసిన కొంత కాలానికి అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక ఉంది.