తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ మంచి పని చేశారని కోడంగల్ ఎమ్మెల్యే , నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు.కెసీఆర్ చేసిన మంచి పని ఏమిటి? ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళడమే.కెసీఆర్ చేసిన మంచి పని కారణంగా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డాడు.అమరావతికి వెళ్ళడం, చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నాడు.
అమరావతి నిర్మాణాన్ని బాబు సవాలుగా తీసుకున్నారని ప్రశంసించాడు.కెసీఅర్ అమరావతి వెళ్ళడం మంచి పని అని ప్రతివారూ అంటున్నారు.
చంద్ర బాబు కూడా కెసీఆర్ పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నారు.శంకుస్థాపన శిలా ఫలకం మీద కెసీఆర్ పేరు ప్రముఖంగా వేయించారు.
ఇలా చేయడమంటే ఆయనకు చాలా గౌరవం ఇచ్చినట్లే లెక్క.అయితే ఈ మంచి వాతావరణం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు.
ఏదో ఒక విషయంలో ఇద్దరూ తగాదా పడరనే గ్యారంటీ ఏమీ లేదు.ఇద్దరికీ రాజకీయ ప్రయోజనాలే ప్రధానం కదా.