సాధారణంగా కుక్కను చూసి ఏ కోడి పిల్ల( baby chicken ) అయినా తన ప్రాణాలను ఎక్కడ హరిస్తుందోని వెంటనే పరుగులంకిస్తుంది.అలాగే కుక్కలు కూడా కోడి పిల్ల కనిపించగానే ఏదో చికెన్ ముక్క దొరికినట్టు తినేయాలని కాపుగస్టు ఉంటాయి.
అది వాటి మధ్య శత్రుత్వం.అయితే అలాంటి రెండు విజాతి జంతువులమధ్య స్నేహభావాన్ని ఎపుడైనా చూశారా? వాటి మధ్య స్నేహం కుదురుతుందని కలలో కూడా ఎవరూ ఊహించరు.కానీ కుదిరింది.కావాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి తిలకించండి.
ఒక వీధి కుక్క కోడి పిల్ల సమూహంతోనే స్నేహం( friendship ) చేయడం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘నిజమైన స్నేహం’ అంటే ఇదే అంటూ ఆ మూగ జీవాలను ఆకాశానికెత్తేస్తున్నారు.అసలు ఆ కుక్కకు కోడి పిల్లలతో స్నేహం ఎలా కుదిరిందంటే.తన తల్లితో తిరుగుతున్న ఓ కోడి పిల్లతో స్నేహం చేసేందుకు ప్రయత్నించింది వీధి కుక్క( stray dog ).అయితే ఆ తల్లి కోడి ఆ విధి కుక్కను నమ్మలేదు.దాంతో ఆ తల్లి తన పిల్లల వద్దకు దాన్ని రానివ్వలేదు.
‘నా పిల్లల వద్దకు రాకు’ అంటూ ఆ కుక్కను పొడిచే ప్రయత్నం కూడా చేసింది ఆ తల్లి కోడి.
అయితే ఎలా సాధ్యమయిందో తెలియదుగాని ఆ కుక్క అందులో ఒక కోడి పిల్లతో స్నేహం కుదుర్చుకుంది.తమ తోబుట్టువులో స్నేహం చేస్తున్న కుక్క, తమను ఏం చేయదని గ్రహించిన మిగిలిన కోడిపిల్లలు కూడా దానితో స్నేహం చేయడం మొదలెట్టాయి.అలా సాగిన ఈ దృశ్యాలను వీడియో తీసిన వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇక ‘కుక్క-కోడిపిల్లల స్నేహం’ వీడియోని చూసిన నెటిజన్లు కుక్క సాధుస్వభావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదే క్రమంలో పలువురు నెటిజన్లు వాటి స్నేహం కలకాలం అలాగే నిలిచిపోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.