బాప్రే, చేతికి చిక్కిన రెండు తలల తాబేలు.. వీడియో వైరల్!

మనమందరం తాబేళ్లను ఎన్నోసార్లు చూసే ఉంటాం.అయితే తాజాగా ఒక విచిత్రమైన తాబేలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

 Viral Video Strange Tortoise Caught With Two Heads Details, Viral Latest, Viral-TeluguStop.com

ఎప్పుడూ చూసే తాబేలులో ఆశ్చర్యపోవాల్సిన ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా.అయితే మీరు ఈ వీడియో తప్పక చూడాల్సిందే.

ప్రపంచంలో నివసించే ఏ ప్రాణికి అయినా ఒకటే తల ఉంటుంది.కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే తాబేలుకి రెండు తలలు ఉన్నాయి.

తాజాగా ఒకరి చేతికి చిక్కిన ఈ తాబేలు వింతల్లో వింత గా నిలుస్తోంది.

వాస్తవానికి జీవులు ఇలా రెండు తలలతో పుట్టడం చాలా అరుదు.

మరీ ముఖ్యంగా తాబేళ్లు ఒకటే తలతో పుడుతుంటాయి.కానీ ఈ తాబేలు మాత్రం రెండు తలలతో జన్మించి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు అబ్బుర పడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో రెండు తలలు ఉన్న తాబేలు పిల్లను చూడొచ్చు.ఒకటే పెంకులో ఉన్న ఈ తాబేలకు ఆరు కాళ్లు ఉన్నాయి.ఇది చూసేందుకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది.అయితే ఇలా రెండు తలలతో పుట్టినప్పటికీ తాబేలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఒకే పెంకులో రెండు తలలు కల్గిన ఈ తాబేలు ఆహారం తినే విషయంలో చాలా కష్టపడాల్సి రావొచ్చు.అలాగే ఎటు వెళ్లాలన్నా ఈ తాబేలు త్వరగా వెళ్లలేదు.

ఇంకా చెప్పుకుంటూపోతే ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు తప్పవు.అందుకే నెటిజన్లు దీనిపై జాలి చూపిస్తున్నారు.

ఈ వీడియోకి 50,000కి పైగా వచ్చాయి.దీన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube