ఈ సృష్టిలో అన్నింటికన్నా ముఖ్యమైన బంధంగా గుర్తింపు పొందుతున్న దాటితో తల్లి బిడ్డల బంధం తర్వాత భార్య భర్తల బంధం ఉంది.ఈ భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో కోపతాపాలతో పాటు ప్రేమానురాగాలు కూడా అనేకం దాగి ఉంటాయి.
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని వీరు ముందదుకు సాగుతుంటారు.అందుకే వీరి బంధం ఎన్ని సమస్యలు వచ్చినా చెరిగిపోకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది.
కాగా వీరి ప్రయాణంలో ఒకరికి మరొకరు తోడుగా ఉండి అప్పుడప్పుడు ప్రేమను పంచుకుంటేనే సాఫీగా సాగిపోతుంది లైఫ్.లేదంటే చాలా కష్టమనే చెప్పాలి.
కాగా భార్యా భర్తల ప్రేమకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.ఎన్ని సారల్ఉ చూసినా ఇలాంటి వీడియోలు అసలు బోర్ కొట్టవు.అందుకే ఇలాంటి వీడియోలకు నెటిజన్లు హారతి పడుతూనే ఉంటారు.ఇక తాజాగా ఓ లవ్లీ కపుల్స్‌కు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో బాగా హల్ చల్ చేస్తోంది.
సాధారణంగా భార్య పుట్టినరోజులకు భర్తలు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.ఇలాంటి మధుర స్మ్రుతులు లేకపోతే అది జీవితం కాదు కదా.
పైగా ఇలాంటివి ఉంటే ఆ బంధం మరింత బలంగా తయారవుతుందతి.ఇక ఈ జంటకూడా ఇలాగే చేసింది.
ఇందులో తన భార్య పుట్టిన రోజునాడు భర్త స్పెషల్ ప్లానింగ్ ఏమీ చేయలేదంటూ భార్య బాధపడటం మనకు కనిపిస్తుంది.పుట్టిన రోజు అంటే కేవలం కేక్ కటింగ్ లేదా డిన్నర్ పార్టీలు కాదని ఇంకా స్పెషల్ గా ఉండాలని చెప్పడం కూడా మనం చూడొచ్చు.
కాగా అప్పుడే ఆ భర్తో సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తాడు.తన భార్యకు బ్రతికి ఉన్నంత కాలం ఈ బర్త్ డే గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తాడు.అతనే కంటెంట్ క్రియేటర్ గా యూట్యూబ్‌లో ఫేమస్ అయిన హర్‌ప్రీత్, సింగ్.తన భార్య ముఖాన్ని హర్ ప్రీత్ తన చేతి మీద టాటూగా ముద్రించుకోవడాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు.
దాన్ని చూసినంతనే ఆమె భావోద్వేగానికి గురవడం కూడా కనిపిస్తుంది.