విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లైగర్.ఆగష్టు 25న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే పీక్స్ లో చేస్తున్నారు.
ఇక ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో అనన్యా పాండేకి అన్యాయం జరిగినట్టు తెలుస్తుంది.హీరో విజయ్ దేవరకొండకి ఈ సినిమా కోసం 20 నుంచి 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్.
ఇక మైక్ టైసన్ కి కూడా సినిమా కోసం భారీగానే ఇచ్చుకున్నారని తెలుస్తుంది.
ఇక హీరోయిన్ అనన్యాకి మాత్రం 3 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చారట.100 కోట్ల బడ్జెట్ లో హీరోయిన్ కి మాత్రం కేవలం 3 కోట్లు ఇవ్వడం షాక్ ఇస్తుంది.రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా అనన్యా పాండే ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.
సినిమాలో ఆమె అందాల విందు ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పొచ్చు. విజయ్, అనన్యా ల జోడీ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు.బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ బిజినెస్ చేసింది.విజయ్ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీ కానుందని చెప్పొచ్చు.