రాజమౌళి కాళ్ళు మొక్కిన స్టార్ హీరోయిన్..!

దర్శక ధీరుడు రాజమౌళి స్టార్ హీరోయిన్ చేసిన పనికి షాక్ అయ్యాడు.లేటెస్ట్ గా ఓ సినిమా ప్రీమియర్ షోకి వెళ్లిన జక్కన్న కాళ్ల మీద ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అమాంతం కాళ్ల మీద పడింది.

 Star Heroine Taking Blessing From Rajamouli,rajamouli,anupama Parameswaran, Kart-TeluguStop.com

హీరోయిన్ అలా చేస్తుందని అసలు ఊహించలేదు రాజమౌళి.ఇంతకీ రాజమౌళి కాళ్ల మీద పడి ఆయన ఆశీస్సులు తీసుకున్న హీరోయిన్ ఎవరంటే మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అని తెలుస్తుంది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.

శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ప్రీమియర్ షోకి రాజమౌళి ఫ్యామిలీ వచ్చింది.సినిమా చూసిన తర్వాత చిత్రయూనిట్ కి తన అభినందనలు తెలిపారు రాజమౌళి.ఈ క్రమంలో అనుపమ రాజమౌళి కాళ్ల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంది.ఓ హీరోయిన్ అయ్యుండి ఆమె అలా చేయడం అక్కడ ఉన్న వారందరిని ఆశ్చర్యపరచింది.

నిఖిల్ తో కార్తికేయ 2 మాత్రమే కాదు సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న 18 పేజెస్ సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది.కార్తికేయ 2 హిట్ కొట్టగా ఆ సినిమాకు కూడా ఈ క్రేజ్ కొనసాగించే ఛాన్స్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube