చాలావరకు సినిమా ప్రియులు క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలన్నీ ఎక్కువగా ఇష్టపడతారు.పైగా మాస్ కంటెంట్ ను కూడా బాగా ఇష్టపడతారు.
అలా ఒక సినిమా విడుదలైంది అంటే చాలు అందులో మాస్ తనం ఉందా లేదా అని ముందుగానే చూసుకుంటారు.క్లాస్ సినిమాలను కూడా ఇష్టపడగా తమ కిష్టంగా మాస్ సినిమాలనే ఎంచుకుంటారు సిని ప్రియులు.
ఇక తమకు నచ్చిన మాస్ కంటెంట్ తో ఏదైనా సినిమా విడుదల అయితే చాలు.తమకు ఆరోజు ఎన్ని పనులు ఉన్న సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్తుంటారు.
కొందరు ప్రేక్షకులు తమ అభిమాన హీరోని బట్టి వెళ్తే మరికొందరు అందులో ఉండే మాస్ కంటెంట్, యాక్షన్ కంటెంట్ కోసం వెళ్తుంటారు.ఆ సమయంలో మరే సినిమా వచ్చినా కూడా ఆ సినిమాలను అస్సలు పట్టించుకోరు.
నిజానికి మాస్ సినిమా సమయంలో క్లాస్ సినిమాలు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ చేయలేవు.ఆ సమయంలో క్లాస్ సినిమాలు విడుదల కాకపోవడమే మంచిది అనిపిస్తుంది.
కానీ ఓసారి మంచి మాస్ సినిమా పైగా స్టార్ హీరో సినిమా విడుదల కాగా ఆ సమయంలో ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
ఇక అదే సమయంలో మరో స్టార్ హీరో సినిమా క్లాస్ కంటెంట్ తో తెరకెక్కింది.దీంతో ఆ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో.అందరూ మాస్ సినిమాను ఇష్టపడతారు కాబట్టి ఆ సినిమాకే వెళ్తారు అనుకోవడంలో పొరపాటు లేదు.
కానీ ఆ సమయంలో విడుదలైన క్లాస్ సినిమాకు వెళ్లి మంచి హిట్ ను అందించారు.
ఇంతకూ అదే సినిమానో కాదు.టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన వసంతం.2003లో డైరెక్టర్ విక్రమన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా వసంతం.ఇందులో వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి నటించి ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేశారు.ఈ సినిమా మంచి స్నేహబంధం అనే నేపథ్యంలో తెరకెక్కింది.
దీంతో ఈ సినిమా చివరి వరకు మంచి ఎమోషనల్ తో సాగుతుంది.అలా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా సమయంలో మంచి మాస్ మూవీ సింహాద్రి విడుదలయింది.ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా.ఇందులో ఎన్టీఆర్, భూమిక, అంకిత నటించారు.
ఈ సినిమా మాత్రం మంచి మాస్ కంటెంట్ తో విడుదలైంది.
పైగా ప్రేక్షకులకు నచ్చే హీరో, మెచ్చే దర్శకుడు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సమయంలో అందరూ వెంకటేష్ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారు.అంటే మంచి మాస్ మూవీగా తెరకెక్కిన ఎన్టీఆర్ సినిమా సమయంలో క్లాస్, ఎమోషనల్ కథతో ముందుకు వచ్చిన వెంకటేష్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కారణం ఆ సినిమాలో చూపించిన స్నేహబంధం అని క్లియర్ గా అర్థమవుతుంది.