వెంకటేష్ మహా నుంచి వస్తున్న సుమతి... వైజాగ్ ని వదిలేసి అమెరికా

న్యాచురల్ గా మన చుట్టూ జరిగే కథలతో, అలాంటి వాతావరణం తెరపై ఆవిష్కరించే సినిమాలు ఎక్కువగా తమిళంలో, కన్నడంలో వస్తూ ఉంటాయి.అయితే తెలుగులో అలాంటి జోనర్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా మారిపోయాడు.

 Venkatesh Maha's Next Is Su Mathi, Tollywood, Su Mathi Movie, Venkatesh Maha-TeluguStop.com

మొదటి సినిమా కేరాఫ్ కంచరపాలెం, తాజాగా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో న్యాచురల్ కథ, కథనాలతో సినిమాలు తెరకెక్కించి దర్శకుడుగా తాను ఎలాంటి సినిమాలు తీస్తానో అనే విషయం పూర్తిగా చెప్పేశాడు.వాస్తవ సంఘటనలతో ఎలాంటి సినిమాటిక్ స్టైల్ లేకుండా వెంకటేష్ సినిమాలు ఉంటాయని ప్రేక్షకులతో అనిపించుకున్నాడు.

ఇలాంటి స్టైల్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి కొత్త కాబట్టి భాగానే ఆదరిస్తున్నారు.నేచురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు మన ఇంట్లో లేదా మన చుట్టూ జరిగినట్లు అనిపిస్తాయి.

కాబట్టి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారు.ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్న వెంకటేష్ మూడో సినిమాకి కూడా అలాంటి కంటెంట్ నే తీసుకున్నాడు.

అయితే మొదటి, రెండు చిత్రాల కోసం వైజాగ్ నే ఎంచుకున్న వెంకటేష్ ఈ సారి ఏకంగా అమెరికా వెళ్ళిపోతున్నాడు.అమెరికాలోని ఎంపైర్ స్టేట్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చేసింది.

ఒక పల్లెటూరు వృద్దురాలు సిటీకి వచ్చిన సమయంలో ఆమె ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ తోనే దర్శకుడు చెప్పకనే చెప్పాడు.ఈ కథను దర్శకుడు మహా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్నట్లుగా సమాచారం.

తన జీవితంలో జరిగిన ఒక మహిళ జీవితాన్ని అతడు ఈ సినిమాలో కాస్త డ్రమటిక్ గా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు.ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణ నిర్మిస్తుంది.

మరి మూడో సినిమాలో అమెరికా వాతావరణాన్ని వెంకటేష్ ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube