మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వనిత విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీ విషయాల్లోనే వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది.

 Vanitha Vijaykumar Controversy Speech At Thandupalayam Event Details, Vanitha Vi-TeluguStop.com

గతంలో పెళ్లి వార్తల విషయాల్లో ఎక్కువగా వార్తలో నిలిచిన వనితా విజయ్ కుమార్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

మరి ఆ వివరాల్లోకి వెళితే.వనితా సోనియా అగర్వాల్‌( Sonia Aggarwal ) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండుపాళ్యం.( Dandupalyam )

Telugu Venkat, Sonia Agarwal, Thandupalayam, Vanithavijay-Movie

ఇతర పాత్రల్లో ముమైత్‌ ఖాన్‌, ఫిలిమ్స్‌ సుబ్రమణ్యం, బిర్లా బోస్‌, ఆలియా, నిషా రఫీక్‌ ఘోష్‌, రవి శంకర్‌ తదితరులు నటించగా, టైగర్‌ వెంకట్‌ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆడియో కార్యక్రమంలో సినీ ప్రముఖులు ఆర్‌.అరవింద్‌రాజ్‌, మంగై అరిరాజన్‌, సౌందర్‌, ఎన్‌.విజయ మురళి, క్రైమ్‌ సెల్వరాజ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియో రిలీజ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకట్‌( Director Venkat ) మాట్లాడుతూ.1980 నుంచి నేటి వరకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలు వంటి ఘోరాలకు ఒక ముఠా పాల్పడుతుంది.

Telugu Venkat, Sonia Agarwal, Thandupalayam, Vanithavijay-Movie

వీరిలో ఒక బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.ఈ ముఠాపై 390 చోరీలు, 108 హత్యలు, 90 అత్యాచారం లాంటి కేసులు ఉన్నాయి.ఒకే ముఠాకు ఆరు సార్లు మరణశిక్ష పడుతుంది.ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి.కానీ, ఇప్పటివరకు ఒక్కరికి కూడా మరణ శిక్ష అమలు చేయలేదు.అరెస్టయిన వారిని అన్ని కేసుల్లో నిర్దోషులుగా విడుదల చేస్తున్నారు.

ఇపుడు కేవలం పది కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.ఈ కేసులోని నిందితులంతా నిరక్ష్యరాస్యులైన దినసరి కూలీలు.

ఇలాంటి యధార్ధ సంఘటనల సమూహారమే ఈ చిత్ర కథ.మొదటి భాగానికి రెండో భాగానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.వనితా విజయకుమార్‌ మాట్లాడుతూ.ఒక మంచి కథలో నటించానన్న అనుభూతి మిగిలింది.సహ నటి సోనియా అగర్వాల్‌ తో మంచి బాండింగ్‌ ఏర్పడింది.తమిళనాడులో స్థిరపడి, ఇండస్ట్రీనే నమ్ముకున్న వారికి అవకాశాలు రావడం లేదు.

ఇది విచారించదగిన విషయం అని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube