టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయన ‘అల వైకుంఠపురములో‘ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇంత వరకు మరొక సినిమా మొదలు పెట్టలేదు.ముందు ఎన్టీఆర్ తో అయిననూ పోయి రావలె హస్తినకుసినిమా ప్రకటించాడు.
కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
అందుకే ఈ సినిమా పక్కన పెట్టి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబుతో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.అయితే ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఈ సినిమాతో పాటు పవన్ సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించే బాధ్యత తీసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు.
![Telugu Sagar Chandra, Mahesh Babu, Nithya Menon, Pawan Kalyan, Pawan, Rana, Triv Telugu Sagar Chandra, Mahesh Babu, Nithya Menon, Pawan Kalyan, Pawan, Rana, Triv]( https://telugustop.com/wp-content/uploads/2021/08/pawan-movie-update-director-sagar-k-chandra-Mahesh-Babu.jpg)
అందుకే ముందుగా త్రివిక్రమ్ పవన్ తో చేసే సినిమా పూర్తి చేసిన తర్వాతే మహేష్ సినిమా పనులు స్టార్ట్ చేయబోతారని వార్తలు వస్తున్నాయి.పవన్ అయ్యప్పనుమ్ కోషియంఅనే రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
![Telugu Sagar Chandra, Mahesh Babu, Nithya Menon, Pawan Kalyan, Pawan, Rana, Triv Telugu Sagar Chandra, Mahesh Babu, Nithya Menon, Pawan Kalyan, Pawan, Rana, Triv]( https://telugustop.com/wp-content/uploads/2021/08/Mahesh-movie-after-PawanTrivikram-Pawan-Kalyan-Rana-Nithya-Menonayyappanum-koshiyum-tollywood.jpg)
ఈ రీమేక్ సినిమాను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా బాగానే మార్పులు చేసి తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు త్రివిక్రమ్ పవన్ పోషిస్తున్న భీమ్లా నాయక్ పాత్రపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాడట.షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా దగ్గరుండి మరి పర్వవేక్షిస్తున్నారని టాక్.
ఈ సినిమా పూర్తి అయితే కానీ మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ చేయడని టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ సినిమా అయితే కానీ త్రివిక్రమ్ మహేష్ సినిమా వైపు చూస్తాడట.