సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత ఒకరికొకరు మంచి ఫ్రెండ్స్ గా ఉండి తర్వాత లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వారిలో కొందరు ఇప్పుడు మనం చూద్దాం.
నాగార్జున అమల
నాగార్జున మొదట డాక్టర్ డి.రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు పెళ్ళయిన కొన్ని రోజులకే వాళ్ళకి నాగచైతన్య జన్మించాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి దాంతో ఇద్దరు కలిసి బతకలేక విడాకులు తీసుకున్నారు ఒక ఎన్నారై నీ పెళ్లి చేసుకొని ప్రస్తుతం లక్ష్మి అమెరికాలో ఉంటున్నారు.ఇదిలా ఉంటే తర్వాత నాగార్జున తనతో వరుసగా సినిమాలు చేసిన అమల నీ ప్రేమించి నాగేశ్వరరావు అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి అఖిల్ జన్మించాడు.ప్రస్తుతం అఖిల్ హీరోగా రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్పూ
రి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా రేణు దేశాయ్ నటించింది.ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఇద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది అయితే సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారు అని చాలా మంది అనుకుంటారు.రేణుదేశాయ్ కంటే ముందే పవన్ కళ్యాణ్ కి నందిని అనే అమ్మాయి తో పెళ్లి అయింది ఆమెతో విడాకులు తీసుకుని రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా ఉంటుంది అయితే పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అయిన అన్న లెజ్నేవాని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే పార్టీని నడపడానికి అవసరమైన డబ్బు సమకూర్చడానికి తనకు వీలున్నప్పుడు సినిమాల్లో నటిస్తున్నాడు సమ్మర్ లో వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.
జీవితా రాజశేఖర్జీ
విత రాజశేఖర్ లు కూడా తలంబ్రాలు సినిమాతో కలిసి నటించారు ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి అంకుశం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్ లో రావడం విశేషం.క్రమంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ అనేది పుట్టి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు ప్రస్తుతం రాజశేఖర్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు జీవిత వీలైనప్పుడల్లా సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు.
మహేష్ బాబు నమ్రత
రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు అనతికాలంలోనే ప్రిన్స్ మహేష్ బాబు గా గుర్తింపు పొందాడు అయితే తన మూడో సినిమా అయిన వంశీ సినిమాలో హీరోయిన్ గా చేసిన నమ్రతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.అయితే నమ్రత కూడా వాళ్లకు సంబంధించిన బిజినెస్ లు చూసుకుంటూ మహేష్ చేయాల్సిన సినిమాలకు సంబంధించిన పనులు కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంది.
సూర్య జ్యోతిక
సూర్య తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో అతనికి మంచి మార్కెట్ ఉంది ఆయన చేసిన గజిని సినిమాతో తెలుగులో కూడా అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రీసెంట్ గా వచ్చిన ఆకాశమే హద్దురా సినిమాలో తన నటనకు మంచి ప్రశంసలు లభించాయి అలాగే సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.జ్యోతిక కూడా మనందరికీ తెలిసిన హీరోయిన్ తెలుగులో ఠాగూర్, మాస్ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించింది.సూర్య జ్యోతిక ఇద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించారు దాంతో వారి మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.
కమల్ హాసన్ గౌతమి
కమల్ హాసన్ మొదట వాణి గణపతి అనే ఆవిడ ని పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ల పాటు కాపురం సాఫీగా సాగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మనస్పర్థల తో ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత కమల్ హాసన్ సారిక అనే నటిని పెళ్లి చేసుకున్నారు సారిక కూతురు శృతి హాసన్, అక్షర హాసన్.అయితే కమల్ హాసన్ కి సారిక కి కూడా విభేదాలు రావడంతో తో ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత కమల్ హాసన్ గౌతమి తో సహజీవనం చేస్తూ వచ్చారు వీరిద్దరూ ద్రోహి సినిమాలో భార్య భర్తలుగా కూడా నటించారు.