అనంతపురం జిల్లా( Anantapur District ) కల్యాణదుర్గం టీడీపీలో( TDP ) టికెట్ వార్ నడుస్తోంది.ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు అల్టీమేటం జారీ చేశారు.
స్థానికేతురలకు నియోజకవర్గ టికెట్ ఇస్తే అంగీకరించబోమని తేల్చి చెప్పారు.కాగా కల్యాణదుర్గం టీడీపీ టికెట్ బరిలో ఉన్నం హనుమంత రాయ చౌదరి, ( Vunnam Hanumantharaya Chowdary ) టీడీపీ ఇంఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు( Uma Maheswara Naidu ) ఉన్నారు.
అయితే మరోవైపు తనకే నియోజకవర్గ టికెట్ ఖరారు అయిందని మరో నేత సురేంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
దీంతో నిన్నటివరకు ఉప్పు నిప్పుగా ఉన్న హనుమంతరాయ చౌదరి, ఉమా మహేశ్వర నాయుడు ఒకే తాటిపైకి వచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నియోజకవర్గ సీటును స్థానికేతరులకు ఇస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు.తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి అల్టీమేటం జారీ చేశారు.