ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించి డిజిటల్ హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.నెట్ ఫ్లిక్స్ మినహా ఇతర ఓటీటీలు సినిమాల ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అయితే క్రేజ్ ఉన్న సినిమాలకు మాత్రం భారీ మొత్తంలో ఆఫర్లు వస్తున్నాయి.టిల్లూ స్క్వేర్( Tillu Square ) డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్( Netflix ) కొనుగోలు చేసిందని తెలుస్తోంది.35 కోట్ల రూపాయలకు టిల్లూ స్క్వేర్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఇప్పటికే విడుదలైన టిల్లూ స్క్వేర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే ట్రైలర్ నుంచి మరింత ఊహించామని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.టిల్లూ స్క్వేర్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 45 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

మల్లిక్ రామ్( Mallik Ram ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా మార్చి నెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.అనుపమ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లలో కనిపించడంతో పాటు గ్లామర్ షోతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.అనుపమ గ్లామర్ షో గురించి కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరి కొందరు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
అనుపమ ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.టిల్లూ స్క్వేర్ మూవీ థియేట్రికల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడైనట్లు తెలుస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ పరంగా ఎదిగిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో మార్కెట్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.