మంచు విష్ణు, పాయల్ రాజ్ ఫుత్ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ!

డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించి ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.ఈ పాటకు ఓ స్పెషాల్టీ ఉంది.అదేంటంటే.

 Prabhu Deva Choreography For Manchu Vishnu, Payal Rajput Song, Prabhu Deva , Ga-TeluguStop.com

చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం.

ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రం యూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తున్న ‘గాలి నాగేశ్వరరావు‘ క్యారెక్టర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇంటర్నేషనల్ సెన్సేషన్ సన్నీలియోన్ రేణుకగా, పాయల్ పాజ్ ఫుత్ స్వాతిగా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్.

 డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube