తెలుగు సినిమా పరిశ్రమకు ఎంత చరిత్ర ఉందో తెలిసిందే.ఈ చరిత్రలో ఎందరో హీరో హీరోయిన్లు తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
అయితే వారిలో కొన్ని జంటలను మాత్రం తెలుగు ప్రజలకు అలా గుర్తుండిపోతారు.అలాంటి జంటలలో సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల, కృష్ణ – జయప్రద, కృష్ణ – శ్రీదేవి, బాలయ్య – విజయశాంతి, చిరంజీవి – విజయశాంతి లు వీళ్ళు సినిమా రంగంలో ఉన్నా లేకపోయినా వీరి పేరు నిలిచిపోతుంది.
అయితే ఈ జంటలలో కృష్ణ జయప్రద కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక నేషనల్ వైడ్ గా ట్రెండ్ సెట్టర్ అయింది.వీరిద్దరి కాంబోలో అప్పట్లో వచ్చిన సినిమాకు ఒక సంచలనం అని చెప్పాలి.
గతంలో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అప్పుడు చాలా సినిమాలు వచ్చాయి అందరినీ ఆకట్టుకున్నాయి.వీరిద్దరూ కలిసి మొత్తం 45 సినిమాలు చేశారు.వీరి నుండి సినిమా వస్తోంది అంటే చాలు ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్ట్టుకునే వారు.అయితే వీరిద్దరూ తొలిసారి కలిసిన నటించిన చిత్రం ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన “శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్”.
కానీ ఈ చిత్రం ఆశించిన మేర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఆ వెంటనే “మనవూరి కథ” అంటూ మరో సినిమాతో వచ్చారు.
అయితే ఈ సారి కూడా అదృష్టం కలిసి రాలేదు.అది కూడా ప్లాప్ అయింది.
కానీ మూడవ సినిమా ఈనాడు బంధం ఏనాటిదో నుండి దొంగలకు దొంగ, అల్లరి బుల్లోడు, ఊరికి మొనగాడు లతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు.
అయితే అప్పట్లో బాలకృష్ణ శ్రీదేవిలా జోడీ బాగా హిట్ అయింది.

అప్పుడే జయప్రద శ్రీదేవి ల కాంబో మంచి పేరు తెచ్చుకుని వరుస సినిమాలు చేస్తూ రికార్డు సృష్టించారు.ఇలా కృష్ణ కెరీర్ మంచి ఊపుమీద ఉండగానే ఇందిరతో పెళ్లి అయింది.ఆ తరువాత విజయనిర్మలను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరూ ఎక్కువగా కలిసి సినిమాలు చేస్తుండడంతో కృష్ణకు జయప్రదపై తెలియని ప్రేమ ఉండేదని తెలిసింది.అన్ని విషయాలలో జయప్రదను బాగా చూసుకునేవారట.అంతే కాకుండా జయప్రద సినిమాలను ముందే బుక్ చేసుకుని డేట్స్, మరియు అడ్వాన్స్ లు ఇప్పించే వారని తెలుస్తోంది.
ఇక షూటింగ్ సమయంలో కానీ, లేదా ఇతర విషయాలలో కానీ జయప్రదను ఎవరైనా ఏమైనా అంటే కృష్ణ ఊరుకునేవాడు కాదట.

అయితే ఇలా కృష్ణ భార్య కన్నా జయప్రద పట్ల ఆసక్తి ఎక్కువ కావడంతో విజయనిర్మలకు జయప్రదపై కోపం ఎక్కువైంది.ఇందుకోసం విజయ నిర్మల జయప్రదలు అస్సలు పట్టీ పట్టనట్టు ఉండేవారని తెలిసింది.అయితే కాలక్రమేణా ఆ ఫీలింగ్ ఇద్దరిలోనూ తగ్గుతూ వచ్చి నార్మల్ ఆ అయిపోయారు.







