కాసుల వ‌ర్షం కురిపిస్తున్న డోలో-650.. కంపెనీకి పైస‌ల పంట‌

ఇప్పుడు క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత మెడిసిన్ల‌కు ఎంత డిమాండ్ పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ముఖ్యంగా ద‌గ్గు వ‌చ్చినా లేదంటే జ‌లుబు చేసినా స‌రే వెంట‌నే మెడిక‌ల్ షాపుల‌కు వెళ్లి డోలో-650 ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు.

 Dolo-650 Pouring Rain Of Cash  Crop For The Company Paise , Dolo-650, Viral Pics-TeluguStop.com

ఏ మాత్రం త‌ల నొప్పిగా ఉన్నా స‌రే లేదంటే కొంచెం అల‌స‌ట‌, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు ఉన్నా స‌రే వెంట‌నే డోలో ట్యాబ్లెట్‌తో చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు ప్ర‌జ‌లు.ఇలా మెడిక‌ల్ షాపుల్లో డోలో ట్యాబ్లెట్‌కు విప‌రీతంగా డిమాండ్ పెరిగిపోయింది.

దేశ వ్యాప్తంగా ఈ ట్యాబ్లెట్‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగిపోయింది ఇప్పుడు.

వాస్త‌వానికి డాక్ట‌ర్ల సలహా లేకుండా Dolo 650 ట్యాబ్లెట్ల‌ను మాత్రం అస్స‌లు వేసుకోవ‌ద్దంట‌.

కానీ ఈ విష‌యం తెలిసినా కూడా చాలామంది వీటిని మెడిక‌ల్ షాపుల్లో తెచ్చుకుని వేసుకుంటున్నారు.ఇక క‌రోనా ల‌క్ష‌ణాల‌కు జ్వ‌రం ల‌క్ష‌ణాల‌కు ద‌గ్గ‌రి పోలిక‌లు ఉండ‌టం కార‌ణంగా ఏ మాత్రం అనుమానం వ‌చ్చినా స‌రే ఎక్కువ కాకుండా ఉండేందుకు చాలామంది వీటిని వేసుకుంటున్నారు.

ఇక డాక్ట‌ర్లు కూడా వీటినే ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తున్నారు.దీంతో ఈ కంపెనీకి విపరీతంగా కాసుల వ‌ర్షం కురుస్తోంది.ఈ క్ర‌మంలోనే ఈ ట్యాబ్లెట్ అరుదైన రికార్డు న‌మోదు చేసింది.

క‌రోనా టైమ్ లో అత్య‌ధికంగా అమ్ముడు పోయిన ట్యాబ్లెట్ గా రికార్డు సృష్టించింది.

దేశంలో క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా దాదాపు 350 కోట్ల డోలో 650 ట్యాబ్లెట్లు కొనుగోలు జ‌రిగిన‌ట్టు కంపెనీ వెల్ల‌డించింది.కాగా క‌రోనా రాక‌ముందు వీటిని ఈ రేంజ్‌లో కొనుగోలు చేయ‌లేద‌ని, కేవ‌లం క‌రోనా త‌ర్వాతే ఇంత‌లా సేల్స్ జ‌రుగుతున్నాయ‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.పోయినేడాదే దాదాపు రూ.307 కోట్ల ట‌ర్నోవ‌ర్ జ‌రిగిన‌ట్టు తెలిపారు డాక్ట‌ర్లు.మ‌రి కొన్ని రోజులు కూడా క‌రోనా ఎలాగూ ఉంటుంది కాబట్టి మ‌రింత‌గా కొనుగోళ్లు జ‌రిగే ఛాన్స్ ఉంది.

Dolo Pill Breaks Sales Record In Covid Pandemic Dolo

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube