ఇటీవల వెరైటీ వంటలు( Variety of dishes ), వినూత్న ఆవిష్కరణలు చేస్తూ చాలామంది తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు.వినూత్న ఆవిష్కరణలకు సంబంధించిన జుగడ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా చపాతీ కోసం కొబ్బరి చిప్పను ఒక మహిళ ఉపయోగించిన వీడియో తెగ ఆకట్టుకుంటోంది.గృహణి కొత్త ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోలో మహిళ కొబ్బరి చిప్పను( Coconut shell ) చపాతీలు చేసేటప్పుడు నూనె వేయడానికి ఉపయోగిస్తుంది.

ఎలా తయారుచేశారంటే.?
కొబ్బరి చిప్ప నుంచి పొట్టు తీసివేయాలి.ఆ తర్వాత దానిని బ్రష్ మాదిరి తయారుచేసుకోవాలి.
తర్వాత ఒక చివరను తాడుతో కట్టి ముడి వేయాలి.దీనిని మీరు దోసె వేసేటప్పుడు పాన్ లో నూనె వేయడానికి లేదా చపాతీలు( Chapatis ) తయారుచేసేటప్పుడు నూనె వేయడానికి ఉపయోగించుకోవచ్చు.
అలాగే దీనితో పాన్ మీద చపాతీలు చుట్టడంతో పాటు వత్తి పఫ్ చేసుకోవచ్చు కూడా.ఈ గృహిణి ఐడియా అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోను సదరు గృహిణి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో ఈ వినూత్న ఆవిష్కరణ అందరిని ఆకట్టుకుంటోంది.సింపుల్ గా భలే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.గృహిణి ఐడియా మాములుగా లేదని కామెంట్ చేస్తోన్నారు.గృహిణులకే ఇలాంటి కొత్త ఆలోచలు వస్తాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి జుగాడ్ వీడియోలు ఇటీవల నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
కొంతమంది తమ టాలెంట్ తో కొత్త వస్తువులు తయారుచేస్తున్నారు.తమలోని ప్రతిభను బయటపెడుతూ ప్రపంచానికి కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తోన్నారు.
సోషల్ మీడియా పుణ్యాన ఇలాంటి ఆవిష్కరణలు అందరికీ తెలుస్తున్నాయి.ఇలాంటి వీడియోను చూసేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తుున్నారు.