మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు.అయితే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను ఇంకా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు.
అయితే ఈ మధ్యనే రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగించుకున్నాడు.
దీంతో ఈ సినిమా అక్టోబర్ 8న పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లబోతుందని ఎప్పటి నుండి వార్తలు వస్తున్నాయి.
మరి ఈ రోజు లాంచ్ కాబోతున్న చరణ్ శంకర్ ప్రాజెక్ట్ కు ముఖ్య అతిధిగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ రాబోతున్నట్టు గత నాలుగు రోజులుగా ఊహాగానాలు వినిపించాయి.అయితే ఇది రూమర్ అని అంతా అనుకున్న ఇప్పుడు ఒక పోస్టర్ చుస్తే ఇది నిజం అని తెలుస్తుంది.
![Telugu Chiranjeevi, Shankar, Kiyara Advabni, Pan India, Ram Charan, Ranveer Sing Telugu Chiranjeevi, Shankar, Kiyara Advabni, Pan India, Ram Charan, Ranveer Sing](https://telugustop.com/wp-content/uploads/2021/09/Ram-Charan-Shankar-RRR-director-shankar-pan-india-movie-SS-Rajamouli-Kiyara-Advabni.jpg )
అయితే కేవలం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు..మరొక ఇద్దరు దిగ్గజ స్టార్స్ కూడా ఈ లాంచ్ కు అతిధులుగా రాబోతున్నారు.ఎవరంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకరైతే మరొకరు టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మరొకరిని తెలుస్తుంది.
వీళ్ళు ముగ్గురు రావడం ఎలా కన్ఫర్మ్ అయ్యిందంటే వారికీ ఆహ్వానం చెబుతున్న ఒక ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
![Telugu Chiranjeevi, Shankar, Kiyara Advabni, Pan India, Ram Charan, Ranveer Sing Telugu Chiranjeevi, Shankar, Kiyara Advabni, Pan India, Ram Charan, Ranveer Sing](https://telugustop.com/wp-content/uploads/2021/09/Shankar-RRR-director-shankar-pan-india-movie-SS-Rajamouli-Kiyara-Advabni-Ranveer-Singh-movie-launching-special-guestsChiranjeevi.jpg )
ఈ భారీ లాంచ్ కు ఈ ముగ్గురు స్టార్స్ రాబోతున్నట్టు ఈ ఫ్లెక్సీ కన్ఫర్మ్ చేసింది.మరి లాంచ్ రోజునే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఫ్రీ పబ్లిసిటీ కూడా అయిపోతుంది.ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన దగ్గర నుండి షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి నెక్స్ట్ సమ్మర్ కు తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నాడు.
.