Extraordinary Man Movie : ఓకే ఒక్క సినిమా… ముగ్గురి జీవితాలు సెట్టు.. కానీ ఫ్లాప్ అయితే ?

ఏదైనా సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా దానిపై అనేక అంచనాలు అందరిలో నెలకొని ఉంటాయి.ఆ సినిమాపై హీరో భవిష్యత్తు, హీరోయిన్ కెరియర్, దర్శకుడి కసరత్తు అన్ని అవసరమే.

 These Three Career Depends Onextraordinary Man Movie-TeluguStop.com

అలాగే వారందరికీ ఇది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది.మరి అదే సినిమా పోతే అందరూ చాలా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

కెరియర్ పరంగా అలాంటి సందర్భం ఇప్పుడు ఒక సినిమా వల్ల ముగ్గురికి కనిపిస్తోంది.అదే నితిన్ ( Nithin )హీరోగా నటిస్తూ వక్కంతం వంశీ దర్శకత్వం చేసి శ్రీలీల హీరోయిన్ గా నటించిన సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ

Telugu Allu Arjun, Extraordinary, Nithin, Skanda, Srileela, Tollywood-Movie

ఏకంగా ఈ ముగ్గురు జీవితాలు ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మూవీ( Extraordinary man movie ) పై ఆధారపడి ఉన్నాయి.అందులో మొట్టమొదటిగా వక్కంతం వంశీ గురించి చెప్పుకుంటే అతనికి ఇది రెండవ సినిమా ఇంతకు ముందే అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తీయగా అది డిజాస్టర్ గా మిగిలింది.దానికన్నా ముందు రైటర్ గా వర్క్ చేసిన వంశీ( Vakkantham vamsi ) రైటర్ గా అనేక మంచి సినిమాలకు స్క్రిప్ట్ అందించాడు.

అలాగే డైలాగ్స్ కూడా రాసేవాడు.కానీ రచయితగా కాకుండా దర్శకత్వం చేస్తూ మెగా ఫోన్ పట్టుకొని వంశీ మొట్ట మొదటిసారి ఫ్లాప్ అయ్యాడు.ఇప్పుడు ఈ సినిమాపై ఆయన బోలేడన్ని ఆశలు పెట్టుకున్నాడు.ఇది కూడా ఫ్లాప్ అయితే ఇక వంశీకి మరోసారి దర్శకత్వం బాధ్యతలు ఇచ్చే ధైర్యం నిర్మాతలకు ఉంటుందా అంటే ఖచ్చితంగా అనుమానమే.

Telugu Allu Arjun, Extraordinary, Nithin, Skanda, Srileela, Tollywood-Movie

ఇక ఎక్స్ట్రాడినరీ మూవీ పై హీరోయిన్ శ్రీ లిల ( Srileela )కెరియర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆధారపడి ఉంది.ఎందుకంటే ఇప్పటికే ఆమెను స్కంద( Skanda ), ఆది కేశవ లాంటి భారీ డిజాస్టర్లు పలకరించాయి.భగవంత్ కేసరి హిట్ అయినా కూడా అది ఎక్కువగా బాలకృష్ణ ఖాతాలోకి వెళ్ళింది.దాంతో ఆమెకు ఇప్పుడు కచ్చితంగా ఒక హిట్టు అవసరం.ఇది తప్పితే కేవలం గుంటూరు కారం మాత్రమే ఆమె ఖాతాలో పెద్ద సినిమా గా ఉంది.ఇక హీరో నితిన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ఎంత మంచిది.

ఎందుకంటే నితిన్ కి హిట్టు లేక చాలా కాలం అయింది.ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ గా మిగిలిపోతున్నాయి.

మరి హీరోగా ఈ సినిమా హిట్ అయితే తప్ప అతడి కెరీర్ డోలాయమానంలో పడకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube