ఆడవాళ్లకు తమ అందం మీద ఉండే శ్రద్ధ అంతా ఇంతా కాదు.అందంగా తయరవడానికి ఎంత టైం కెటాయిస్తారో అందరికి తెలిసిందే.
ఇకపోతే చాల మంది ఏదైనా అకేషన్స్‌కు వెళ్లుతున్న సమయంలో గానీ, ఇంట్లో పార్టీలు ఉన్న సమయంలో గానీ మరింత అందంగా కనబడటానికి బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు.అయితే ఇలాంటి వారు ఫేసియల్స్ తో మరింత జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది.
ఏ అందం కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లుతున్నారో అదే అందం చెదలుపట్టిన పుట్టలా మారవచ్చూ.ఇప్పుడు మనం చూడబోయే సంఘటన కూడా ఇలాంటిదే.
ఆ వివరాలు చూస్తే.
ఐఐటీ గౌహతిలో డాక్టర్ చదువుకుంటున్న బినితానాథ్ అనే యువతి తమ బంధువుల వివాహాం ఉండడంతో, ఆ వెకేషన్ లో భాగంగా తన సొంత ఊరైన సిల్చార్ నగరానికి వచ్చారట.
ఈ క్రమంలో అక్కడే ఉన్న శారదా బ్యూటీ పార్లర్ కు ఫేషియల్ చేపించుకుందామని వెళ్లగా, అక్కడ ఉన్న సిబ్బంది డీటాన్ తో ఫేషియల్ చేసుకోమని సలహా ఇచ్చారట.

దానికి ఆమె ఓకే చెప్పగా, వారు ఫేస్‌కు బ్లీచింగ్ చేస్తున్న క్రమంలో ఆమెకు బాగా మంట వచ్చి అరవగా, సిబ్బంది ఐస్ క్యూబ్ లు పెట్టారట.అప్పటికే ఆమె ముఖానికి బొబ్బలు రావడం మొదలయ్యాయట.ఈ ఘటనపై పార్లర్ యజామాన్యానికి ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఈ విషయం పై స్పందించిన పార్లర్ యజమాని, బినితానాథ్ తమ పార్లర్‌కు వచ్చిన సమయంలో తాము పార్లర్ లో లేమని సంజాయిషి ఇచ్చుకుంటూ, డీట్యాన్ తరువాత బ్లీచ్ చేయరాదని తమ స్టాఫ్ బినితకు చెప్పినా ఆమె బ్లీచింగ్ చేయాలని పట్టుబడటంతో ఆమె చెప్పినట్లే చేయడం వల్లా అలా జరిగిందని నిందను బినితానాథ్ పై వేశాడు పార్లర్ యజమాని.