హైదరాబాద్ లోని చందానగర్ ఈ- సేవ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అభయహస్తం పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఇవ్వడం లేదని ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఉదయం నుంచే ప్రజలు ఈ-సేవ కేంద్రం వద్ద బారులు తీరారు.అయితే ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వలేదని ప్రజలు నిరసనకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు ప్రజలందరూ క్యూ లైన్ లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అయితే ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.