హైదరాబాద్ చందానగర్ ఈ-సేవ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
TeluguStop.com
హైదరాబాద్ లోని చందానగర్ ఈ- సేవ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అభయహస్తం పథకానికి సంబంధించిన దరఖాస్తులను ఇవ్వడం లేదని ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
ఉదయం నుంచే ప్రజలు ఈ-సేవ కేంద్రం వద్ద బారులు తీరారు.అయితే ఇప్పటివరకు దరఖాస్తులు ఇవ్వలేదని ప్రజలు నిరసనకు దిగారు.
రంగంలోకి దిగిన పోలీసులు ప్రజలందరూ క్యూ లైన్ లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ క్రమంలోనే వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హ్యాండ్‌స్టాండ్ ట్రిక్‌తో కళ్లముందే మాయం.. ఇదెలా చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!