తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) బస్సు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ జెడ్పీ ఛైర్మన్ ముల్లపూడి బాపిరాజు( Former ZP Chairman Mullapudi Bapiraju ) వర్గీయులు ఆందోళనకు దిగారు.
గోపాలపురం నియోజకవర్గం సీటును మద్దిపాటి వెంకటరాజు( Maddipati Venkataraju )కు కేటాయించడంతో నిరసనకు దిగారు.ఈ క్రమంలోనే మద్దిపాటి మాకు వద్దంటూ బాపిరాజు వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాపిరాజు ఎదురుచూసిన సంగతి తెలిసిందే.అయితే అపాయింట్మెంట్ దొరకకపోవడంతో చంద్రబాబు బస్సు వైపు ఆయన వర్గీయులు దూసుకెళ్లారు.
దీంతో బాపిరాజుతో పాటు 30 మందికి చంద్రబాబు కలిసేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.కాగా గోపాలపురం వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.