తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో చంద్రబాబు బస్సు వద్ద ఉద్రిక్తత

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) బస్సు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మాజీ జెడ్పీ ఛైర్మన్ ముల్లపూడి బాపిరాజు( Former ZP Chairman Mullapudi Bapiraju ) వర్గీయులు ఆందోళనకు దిగారు.

గోపాలపురం నియోజకవర్గం సీటును మద్దిపాటి వెంకటరాజు( Maddipati Venkataraju )కు కేటాయించడంతో నిరసనకు దిగారు.

ఈ క్రమంలోనే మద్దిపాటి మాకు వద్దంటూ బాపిరాజు వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్‎మెంట్ కోసం బాపిరాజు ఎదురుచూసిన సంగతి తెలిసిందే.అయితే అపాయింట్‎మెంట్ దొరకకపోవడంతో చంద్రబాబు బస్సు వైపు ఆయన వర్గీయులు దూసుకెళ్లారు.

దీంతో బాపిరాజుతో పాటు 30 మందికి చంద్రబాబు కలిసేందుకు అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.

కాగా గోపాలపురం వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!