రానున్న లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్( Congress ) అడుగులు వేస్తుంది.ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ( Janajatara Meeting ) నిర్వహించనుంది.
ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుండగా.ఈ సభకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ,( Rahul Gandhi ) ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) హాజరుకానున్నారు.
సభా వేదికపై నుంచి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రాహుల్ గాంధీ తెలుగులో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా సభా ఏర్పాట్లను కొనసాగిస్తుంది.
అదేవిధంగా సభకు సుమారు 10 లక్షల మంది హాజరయ్యే విధంగా జనసమీకరణ చేస్తుంది.







